ఆంధ్రావాలా తర్వాత పూరిని చూస్తే భయమేసింది.. 11 ఏళ్లకు మళ్లీ కలిశాం
TeluguStop.com
జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) తన కెరీర్ స్టార్టింగ్‌లో స్టూడెంట్ నెం: 1, ఆది, సింహాద్రి వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధిస్తూ దూసుకెళ్లాడు.
అయితే ఈ యంగ్ టైగర్ స్పీడ్‌కు ఆంధ్రావాలా మూవీ( Andhrawala ) ఒక పెద్ద బ్రేక్ వేసిందనే చెప్పాలి.
2002లో వచ్చిన ఈ యాక్షన్ మూవీలో తారక్ డ్యూయల్ రోల్స్ పోషించాడు.రాజమౌళి "సింహాద్రి" తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అలాంటి హై-ఎక్స్‌పెక్టేషన్స్ నడుమ విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.ఈ మూవీ బాగానే ఉంటుంది కానీ అప్పట్లో ప్రేక్షకులకు నచ్చలేదు.
ఈ మూవీ తీసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్( Puri Jagannadh ) డిజాస్టర్ టాక్ రావడంతో షాక్ తిన్నాడు.
ఇక ఎన్టీఆర్ ఇలాంటి ఫెయిల్యూర్ వస్తుందని కలలో కూడా ఊహించలేదు.ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా డైరెక్టర్ గురించి తారక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"""/" /
"ఆంధ్రావాలా ఫ్లాప్ అయ్యింది.దాని తర్వాత కొంచెం లేటుగా దొరికారు ఆయన (పూరి జగన్నాథ్).
ఫోన్ చేయగానే భయ్యా అని అన్నారు.ఆంధ్రావాలా మూవీ ప్లాప్ అయిన తర్వాత కూడా ఆయన గొంతులో ఎనర్జీ ఏమాత్రం పోలేదు.
ఆయన ఎనర్జిటిక్‌గా భయ్యా అంటే నేను మాత్రం భయ్యా అని బాధగా అనేసా.
'భయ్యా మన సినిమా పోయింది.బయటికి వెళ్తే రాళ్లు ఇచ్చుకు కొడతారేమో మనల్ని.
అయినా సరే మీతో పని చేసిన ప్రతిక్షణం నాకు నచ్చింది.కుదిరితే ఇంకొక సినిమా మనం చేద్దాం.
ఈ మచ్చను తొలగించుకుందాం.' అని ఆ రోజు నేను అన్నాను.
" అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. """/" /
"ఆంధ్రావాలా తర్వాత 11 సంవత్సరాల పాటు కలిసి మేము సినిమా చేయలేదు.
దానికి కారణం ఆంధ్రావాలా ఫ్లాప్ అయి ఇద్దరిలో భయం కలిగించడమే.మళ్లీ ఈసారి ఎలాంటి డిజాస్టర్ ఎదురు కాకుండా బాగా చేయాలి, మంచి హిట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అనే తపన బాగా ఉండేది.
బహుశా అందుకేనేమో 11 ఏళ్ల పాటు కలిసి ఏ సినిమా చేయలేకపోయాం.మా ఇద్దరినీ కలిపింది మాత్రం టెంపర్ మూవీ( Temper Movie ) కథే.
" అని తారక్ వెల్లడించాడు.ఆంధ్రావాలా తర్వాత మళ్లీ 11 ఏళ్లకు తారక్ పూరి జగన్నాథ్ తో కలిసి టెంపర్ (2015) మూవీ చేశాడు.
ఈ సినిమా రూ.35 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా రూ.
75 కోట్లు వసూలు చేసింది.ఈ మూవీ స్టోరీతో పాటు ఎన్టీఆర్ యాక్టింగ్ అదిరిపోయింది అనే చెప్పాలి.
ఆసక్తికర విషయం ఏంటంటే, 2004 ప్రాంతంలో జూ.ఎన్టీఆర్ ఏ మాట అన్నాడో ఆ మాటే నిజమైంది.
వీరిద్దరూ తమపై పడిన మచ్చను తొలగించుకోగలిగారు.
చిరంజీవి కి లెజెండరీ అవార్డు మోహన్ బాబు వల్ల మిస్ అయిందా..? నాగార్జున వల్ల దక్కిందా..?