రేపు సినీ హీరో నితిన్ తో జేపీ న‌డ్డా భేటీ..!

రేపు తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా రానున్నారు.ప్ర‌జా సంగ్రామ యాత్ర ముగింపు సంద‌ర్భంగా వ‌రంగ‌ల్ లో ఏర్పాటు చేస్తున్న బ‌హిరంగ స‌భ‌కు ఆయ‌న హాజ‌రుకానున్నారు.

అయితే ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా హైద‌రాబాద్ చేరుకోనున్న నడ్డా.సినీ హీరో నితిన్ తో భేటీ కానున్న‌ట్లు స‌మాచారం.

తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న బీజేపీ జాతీయ నేత‌లు సినీ ప్ర‌ముఖుల‌తో వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హించ‌డం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీస్తోంది.

ఇటీవ‌ల మునుగోడులో నిర్వ‌హించిన బీజేపీ బ‌హిరంగ స‌భ‌కు వ‌చ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.

హీరో ఎన్టీఆర్ తో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే.

అమెరికాలోనే అత్యంత ప్రమాదకరమైన బీచ్.. ఎక్కడుందంటే..