జొన్నల సాగులో ఎరువుల వాడకం.. యాజమాన్య పద్ధతులు..!
TeluguStop.com
భారతదేశంలో మూడవ ప్రధాన ఆహార పంటగా జొన్నలు సాగు( Jowar ) చేయబడుతున్నాయి.
జొన్నలను ఆహారంగా, పశుగ్రాసంగా ఎక్కువగా వినియోగించడం వల్ల ఎప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది.
ఎటువంటి నేలలోనైనా జొన్నలను సాగు చేయవచ్చు.కానీ నీటిపారుదల సౌకర్యం, నేల యొక్క పీహెచ్ విలువ 6 నుండి 7.
5 వరకు ఉండే నెలలలో అధిక దిగుబడి పొందవచ్చు.జొన్నలను సంవత్సరంలోని మూడు కాలాలలో పండించవచ్చు.
ఖరీఫ్ లో అయితే జూన్ నుంచి జూలై వరకు విత్తుకోవచ్చు.రబి లో అయితే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు.
వేసవికాలంలో అయితే జనవరి నుంచి ఫిబ్రవరి వరకు విత్తుకోవచ్చు. """/" /
వేసవిలో భూమిని దాదాపు 20 సెంటీమీటర్ల లోతులో దున్ని, ఓ నాలుగు వారాలపాటు సూర్యరశ్మి తగిలేటట్టు వదిలేయాలి.
ఆ తర్వాత రెండు లేదా మూడుసార్లు భూమిని మెత్తగా దున్ని ఎప్పటికప్పుడు చదును చేసుకోవాలి.
ఒక ఎకరా పొలానికి ఐదు టన్నుల పశువుల ఎరువులు, రెండు కిలోల పాసిలోమైసిస్ లిలసినస్, రెండు కిలోల పాస్పో బ్యాక్టీరియా, రెండు కిలోల అజోస్పిరిల్లమ్ ఎరువులను భూమికి అందించాలి.
ఈ ఎరువులతో భూమిలో నత్రజని శాతం( Nitrogen ) పెరగడంతో పాటు నులిపురుగుల సమస్య అరికట్టబడుతుంది.
రసాయన ఎరువుల విషయానికి వస్తే ఒక ఎకరాకు 25 కిలోల యూరియా, 40 కిలోల DAP,25 కిలోల MOP, ఐదు కిలోల కార్బోప్యూరాన్ 3% , ఐదు కిలోల జింక్ సల్ఫేట్ పొలంలో చల్లాలి.
"""/" /
సరైన జన్యుపరంగా ఉండే స్వచ్ఛ విత్తనాలు ఎకరాకు నాలుగు కిలోలు అవసరం.
ముందుగా ఈ విత్తనాలను ( Seeds ) ఇమిడా క్లోప్రిడ్ 48% FS 4 Ml, రెండు గ్రాముల థైరం 75%WS తో విత్తన శుద్ధి చేసుకోవాలి.
ఆ తర్వాత నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.ఇక విత్తనాలను మూడు సెంటీమీటర్ల లోతులో , మొక్కల మధ్య పది సెంటీమీటర్లు, వరుసల మధ్య 45 సెంటీమీటర్లు ఉండేటట్టు విత్తు కోవాలి.
ఇక విత్తిన తర్వాత వారంలోపు ఒక నీటి తడిని, పంట చేతికి వచ్చేలోపు ఎనిమిది సార్లు నీటి తడులు అందించాలి.
కెనడాలో ఊహించని అద్భుతం.. ఆకాశం నుంచి ఊడిపడిన వింత వస్తువు.. వీడియో చూస్తే!