ఖలిస్తాన్ ఉద్యమంపై నోరెత్తితే చాలు .. కెనడాలో జర్నలిస్టుల దుస్ధితి ఇది : భారత సంతతి ఎంపీ

కెనడా( Canada )లో ఖలిస్తాన్ వేర్పాటువాదుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి.భారత ప్రభుత్వం, భారతీయ దౌత్యవేత్తలు, నాన్ సిక్కులను వారు టార్గెట్ చేస్తున్నారు.

ఖలిస్తాన్ ఉద్యమంపై నోరెత్తితే చాలు దాడులకు తెగబడుతున్నారు.ఇప్పుడు ఏకంగా జర్నలిస్టుల మీదే తిరగబడుతున్నారు.

కొద్దిరోజుల క్రితం కాల్గరీలో భారత సంతతికి చెందిన మీడియా ప్రతినిధిపై దాడి చేశారు.

రెడ్ ఎఫ్ఎమ్ కాల్గరీ అనే రేడియో ఛానెల్ న్యూస్ డైరెక్టర్ రిషి నగర్‌పై అల్బెర్టా ప్రావిన్స్‌లో ఈ దాడి జరిగింది .

నగరంలోని నార్త్ ఈస్ట్ క్వాడ్రంట్‌( North East Quadrant )లో ఎన్నికలకు సంబంధించిన ఓ ఈవెంట్‌కు హాజరై బయటకు వస్తుండగా నగర్‌పై ఈ దాడి జరిగింది.

తాను ఈవెంట్ నుంచి బయటకు వచ్చి నా కారు వైపు వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు దాడి చేశారని ఆయన తెలిపారు.

ఈ ఘటనలో నా ఎడమ కన్ను దెబ్బతిందని, కుడికాలికి గాయమైందని చెప్పారు.దేశంలో ఈ పరిణామాలపై భారత సంతతికి చెందిన కెనడియన్ ఎంపీ చంద్ర ఆర్య ఆవేదన వ్యక్తం చేశారు.

ఖలిస్తానీ తీవ్రవాదం గురించి నివేదించే జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. """/" / హర్దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar )హత్య తర్వాత కెనడాలో హిందూ సెటిలర్లలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని చంద్ర( Chandra Arya ) చెప్పారు.

భారత మూలాలున్న జర్నలిస్టులను ఖలిస్తాన్ వేర్పాటువాదులు టార్గెట్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.రెడ్ ఎఫ్ఎం కాల్గరీకి చెందిన రిషి నగర్‌తో పాటు గతంలో రెడీయో ఏఎం 600 రిచ్‌మండ్‌కి చెందిన సమీర్ కౌశల్‌లపై ఖలిస్తాన్ వాదులు దాడి చేశారని ఆయన గుర్తుచేశారు.

"""/" / 2022లో ఖలిస్తాన్ హింసను విమర్శించినందుకు బ్రాంప్టన్ రేడియో హోస్ట్ దీపిక్ పుంజ్ తన స్టూడియోలోనే దాడికి గురయ్యాడని ఎంపీ తెలిపారు.

ఖలిస్తానీ తీవ్రవాదంపై నివేదిక ఇచ్చినందుకు గాను మోచా బెజిర్గాన్‌కు హత్యా బెదిరింపులు వచ్చినట్లు చంద్ర ఆర్య వెల్లడించారు.

ఇలాంటి వారిని ఉక్కుపాదంతో అణిచివేయాలని , పరిస్ధితి చేయి దాటకముందే ఖలిస్తానీ తీవ్రవాదాన్ని గుర్తించాలని కెనడా ప్రభుత్వాన్ని చంద్ర ఆర్య కోరారు.

వీడియో: కేక్‌ ప్రాంక్ చేసిన వరుడు.. ఎలా బెడిసి కొట్టిందో చూడండి..