ఆ విషయంలో సమంత పెద్ద తప్పు చేసింది.. జర్నలిస్ట్ షాకింగ్ కామెంట్స్!

స్టార్ హీరోయిన్ సమంతకు ప్రస్తుతం చేతినిండా ఆఫర్లు ఉన్నా ఆమె వ్యక్తిగత జీవితం ఆశించిన విధంగా లేదు.

అరుదైన ఆరోగ్య సమస్య అయిన మయోసైటిస్ తో సమంత బాధ పడుతుండగా ఈ వ్యాధి నుంచి సమంత త్వరగా కోలుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

సమంత నాగచైతన్య కలిసి జీవనం సాగించాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నా చైసామ్ కలవడం అంత సులువు కాదని అభిప్రాయపడుతున్నారు.

ప్రముఖ జర్నలిస్ట్ ఇమంది రామారావు మాట్లాడుతూ చైసామ్ లలో ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ ఉందని ఆయన అన్నారు.

విడాకులు తీసుకున్నా విడిపోయినట్టు వాళ్లిద్దరూ ప్రవర్తించలేదని రామారావు పేర్కొన్నారు.తన భర్తతో ఉన్న జ్ఞాపకాలు తనకే పరిమితం కావాలని చైతన్యతో నివాసం ఉన్న ఇంటిని సమంత కొనుక్కున్నారని ఆయన వెల్లడించారు.

సమంతకు చైతన్యపై ఎంతో ప్రేమ ఉందని ఆయన కామెంట్లు చేశారు. """/"/ నాగార్జునకు సమంత కోడలు అయినా కూతురిలా చూసుకున్నారని రామారావు అభిప్రాయపడ్డారు.

సమంతకు వచ్చిన వ్యాధి మానసిక ఒత్తిడి వల్ల వచ్చిందని చైతన్యతో ఉంటే మాత్రమే సమంత వ్యాధి నయమవుతుందని రామారావు అన్నారు.

ఇగో సమస్యల వల్ల చైసామ్ విడిపోయారని సమంతకు ఇష్టం ఉంటే చైసామ్ కలవడం కష్టం కాదని ఆయన తెలిపారు.

అమల మనస్తత్వం కూడా మంచి మనస్తత్వం అని రామారావు అన్నారు.ఇగో వల్లే సమంత విడిపోయారని అదే సమంత చేసిన పెద్ద తప్పు అని ఇమంది రామారావు పరోక్షంగా వెల్లడించారు.

సమంతను గ్లామరస్ రోల్స్ చేయొద్దని అక్కినేని ఫ్యామిలీ సూచించిందని రామారావు అన్నారు.ఆలోచనలను మార్చుకునే దిశగా సమంత అడుగులు వేయాలని ఆయన చెప్పుకొచ్చారు.

సమంతకు ప్రస్తుత పరిస్థితుల్లో కచ్చితంగా తోడు అవసరమనే సంగతి తెలిసిందే.రాబోయే రోజుల్లో చైసామ్ కలిసి అభిమానులకు శుభవార్త చెబుతారేమో చూడాల్సి ఉంది.

అందాన్ని రెట్టింపు చేసే ఆరెంజ్ పీల్.. ఎన్ని విధాలుగా వాడొచ్చో తెలుసా?