జగన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా జోషి నియామకం

వైసీపీ అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా జోషి ని నియమించినట్లు తెలుస్తుంది.

ఈ నెల 30 న ఏపీ నూతన ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే.

నిన్న విడుదల అయిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.

మొత్తం 175 స్థానాలకు గాను వైసీపీ పార్టీ దాదాపు 150 సీట్లు గెలవగా, అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ 24 సీట్ల తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

దీనితో జగన్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి త్వరలో ఏపీ లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.

శనివారం తన తోలి క్యాబినెట్ మీటింగ్ నిర్వహించి, 30 వ తారీఖున సి ఎం గా ప్రమాణస్వీకారం చేస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కి ఏపీ పోలీస్ శాఖ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ను నియమించినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం ఏపీ సీఎం సెక్యూరిటీ వింగ్ లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ ఆఫీసర్ అమర్లపూడి జోషి ని సిఎస్ వోగా నియమించినట్లు తెలుస్తుంది.

వైఎస్ జగన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా జోషి బాధ్యతలు నిర్వహించనున్నారు.

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?