కేసీఆర్ వ్యాఖ్యల తరువాత టీఆర్ఎస్ లో పెరిగిన జోష్

తెలంగాణ రాజకీయాలు ఎన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున ఆసక్తిని రేకేత్తిస్తున్న పరిస్థితి ఉంది.

ఇంకా సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉండటంతో ఇప్పటి నుండే అనధికారికంగా ఎన్నికల వాతావరణం రాష్ట్రంలో ఏర్పడింది.

అయితే టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారాలానే ఉద్దేశ్యంతో పెద్ద ఎత్తున ముందుకు సాగుతున్న తరుణంలో తాజాగా కేసీఆర్ ప్రెస్ మీట్ ద్వారా ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ తో బీజేపీ రాజకీయ విధానం అనేది ఎంతో కొంత ప్రజల్లో క్లారిటీ వచ్చిన పరిస్థితి ఉంది.

అయితే కేసీఆర్ కామెంట్స్ తో మరల టీఆర్ఎస్ క్రితం రూపును సంతరించుకున్న పరిస్థితి ఉంది.

దీంతో టీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున జోష్ పెరిగింది.అయితే ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న కెసీఆర్ ఇప్పటికే కొన్ని బలమైన పధకాలను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారట.

ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఇక టీఆర్ఎస్ శాశ్వతంగా అధికారంలో ఉండేలా చాలా దూరదృష్టితో ఇప్పటి నుండే అంతర్గతంగా కార్యాచరణను చేపడుతున్నట్లు రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

అంతేకాక చాలా ముందునుంచే అంటే ఎన్నికలకు ఆరు నెలల ముందే పార్టీ టికెట్లను కన్ఫర్మ్ చేసినా కూడా ఆశ్చర్య పోనక్కరలేదు.

"""/"/ అయితే ఇప్పటికే చాలా వరకు టికెట్లు ఎవరికి ఇవ్వాలనే విషయంపై ఒక ఖచ్చితమైన క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.

అంతేకాక ఇక ఎన్నికలకు సంవత్సరం ముందు నుండే నియోజకవర్గాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మొత్తం అప్పటివరకు సదరు నియోజకవర్గం ప్రజలు ఎంతగానో వేచి చూసిన పనులను ప్రారంభించి మరల టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకవచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

ఏది ఏమైనా కెసీఆర్ రంగంలోకి దిగితే తప్ప టీఆర్ఎస్ పార్టీలో జోష్ కనిపించడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది.

ఫొటోస్ కోసం కారు నుంచి బయటికి వచ్చిన స్పానిష్ టూరిస్ట్.. తొక్కేసిన ఏనుగులు..??