జోసెఫ్.. ఇది ఇంటర్నేషనల్ మ్యాచ్ అనుకున్నావా? లేక గల్లీ క్రికెట్ అనుకున్నావా? (వీడియో)
TeluguStop.com
సాధారణంగా ఏదైనా ఆటలు ఆడే సమయంలో గొడవలు జరగడం సర్వసాధారణం.ఇక గల్లీలలో క్రికెట్లో ఆటలు ఆడడంలో గొడవలు జరగడం కూడా చాలా సర్వసాధారణం.
ఈ క్రమంలో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరిగి చివరికి అవిపెద్దగా మారి అనేక ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి.
బాలు బాండరీ దాటిందననో, లేదా క్యాచ్ సరిగ్గా పట్టలేదని బ్యాటింగ్ సరిగ్గా లేదని ఇలా అనేక కారణాలతో కొంతమంది ప్లేయర్స్ మ్యాచ్ మధ్య నుంచి మైదానం నుంచి బయటికి వెళ్లిపోతూ ఉంటారు.
అయితే, తాజాగా అంతర్జాతీయ మ్యాచ్లో కెప్టెన్ పై అసహనం వ్యక్తం చేస్తూ ఒక బౌలర్ మ్యాచ్ మధ్యలో మైదానం నుంచి బయటికి వచ్చేసాడు.
ఈ సంఘటన గురువారం బార్బడోస్ వేదికగా వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో వన్డేలో జరిగింది.
"""/" /
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లోని నాలుగో ఓవర్ ను విండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ (Alzarri Joseph) వేశాడు.
ఓవర్ స్టార్ట్ అయ్యేక ముందుకే జోసెఫ్ తనకు కావలసిన విధంగా ఫీల్డ్ ను సెటప్ చేసుకుని మరి కెప్టెన్ షై హోప్‌కు తెలిపాడు.
తనకు ఎక్కడ ఫీల్డర్లు కావాలో కూడా చెప్పాడు.అయితే జోసెఫ్( Joseph) సూచించిన ఫీల్డ్ సెటప్ కాకుండా.
హోప్ మరోలా సెట్ చేశాడు.దీంతో తీవ్రంగా ఆగ్రహానికి గురై అతడు ఆ కోపాన్ని బంతిపై చూపించడం జరిగింది.
నాలుగో బంతి బౌన్సర్ గా వేయగా.దాంతో జోర్డాన్ కాక్స్ అవుట్ అయ్యాడు.
ఇలా ఔట్ చేసిన అనంతరం హోప్‌పై జోసెఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. """/" /
దీంతో అల్జారీ జోసెఫ్(Alzarri Joseph) మరో రెండో బంతులను వేసి నాలుగు ఓవర్ ను పూర్తి చేశాడు.
ఆ తర్వాత కెప్టెన్ పై అసహనం వ్యక్తం చేస్తూ మైదానం నుంచి వెళ్ళిపోయాడు.
అల్జారీ జోసెఫ్.అంతేకాకుండా వెస్టిండీ కోచ్ డారెన్ సామీ పిలుస్తున్నా కూడా అల్జారీ జోసెఫ్ పట్టించుకోకుండా.
ఒక ఓవర్ పాటు డ్రెస్సింగ్ రూమ్ లోనే కూర్చున్నాడు.చివరికి డారెన్ సామీ అతడి దగ్గర వెళ్లి మాట్లాడడంతో.
తిరిగి మైదానంలోకి వచ్చి ఆటను కొనసాగించాడు.ప్రస్తుతం ఏ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు.కొందరు జోసెఫ్ మద్దతు తెలుపుతూ ఉంటే.
మరికొందరు విమర్శలు చేస్తున్నారు.ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ఎనిమిది వికెట్లతో విజయం సొంతం చేసుకుని 2-1 సీరియస్ ను దక్కించుకుంది.
వెంకటేష్ బలహీనతను బయటపెట్టిన సురేష్ బాబు… అలా చేశాడంటే డైరెక్టర్లకు చుక్కలే!