జోజోబా ఆయిల్‌ను ఇలా వాడితే..మొటిమ‌లు ప‌రార్‌!

ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న‌శైలి, కెమిక‌ల్స్ ఎక్కువగా ఉండే స్కిన్‌ ప్రోడెక్ట్స్ వాడ‌కం, చ‌ర్మంపై నూనె ఎక్కువ‌గా ఉత్ప‌త్తి కావ‌డం, ధూమ‌పానం, స్కిన్ కేర్ లేక‌పోవ‌డం, కాలుష్యం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఎంద‌రో మొటిమ‌లు స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.

దాంతో చ‌ర్మం ఎంత తెల్ల‌గా, మృదువ‌గా ఉన్నా.అంద‌హీనంగా క‌నిపిస్తారు.

అందుకే మొటిమ‌ల‌ను త‌గ్గించుకునేందుకు తెగ తాప‌త్రాయ ప‌డుతుంటారు.అయితే అందుకు జోజోబా ఆయిల్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

జోజోబా మొక్కల గింజల నుంచి ఈ ఆయిల్‌ను త‌యారు చేస్తారు. """/"/ ఈ ఆయిల్ చ‌ర్మ సౌంద‌ర్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఎన్నో సౌంద‌ర్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.ముఖ్యంగా మొటిమల‌ను నివారించ‌డంలో జోజోబా ఆయిల్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

మ‌రి దీనిని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందు ఒక బౌల్ తీసుకుని.

అందులో ఒక స్పూన్ జోజోబా ఆయిల్‌, ఒక క‌ల‌బంద జెల్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మొటిమ‌ల‌పై అప్లై చేసి.ప‌ది, ఇర‌వై నిమిషాల త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే మొటిమ‌లు ప‌రార్ అవుతాయి. """/"/ అలాగే ఒక గిన్నె తీసుకుని.

అందులో ఒక స్పూన్ జోజోబా ఆయిల్‌, అర స్పూన్ ముల్తానీ మ‌ట్టి వేసి మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి.పావు గంట పాటు డ్రై అవ్వ‌నిచ్చి.

ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు త‌గ్గ‌డ‌మే కాదు.

చ‌ర్మ ఛాయ కూడా పెరుగుతుంది.ఇక జోజోబా ఆయిల్‌ను మొటిమ‌లు ఉన్న చోట డైరెక్ట్‌గా అప్లై చేసి.

కాసేపు మ‌సాజ్ చేసుకోవాలి.ప‌ది నిమిషాలు వ‌దిలేసి.

ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేసినా కూడా మొటిమ‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

నాగ్ అశ్విన్ మీ ఓం రౌత్ లాంటి వాడు కాదు.. బాలీవుడ్ మెడలు వంచే మొనగాడు