కూలిపనులు చేస్తూ చదివింది.. ఇప్పుడు జాయింట్ కమిషనర్.. నాగలక్ష్మి సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!

కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉండి పని చేస్తూ చదువుకోవాలం టే ఆ కష్టం మామూలు కష్టం కాదు.

ఇప్పటికీ దేశంలోని చాలా పల్లెటూర్లలో కూలిపనులు చేస్తూ చదువుకుంటున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు.

అలా కూలి పనులు చేస్తూ చదివి జాయింట్ కమిషనర్ స్థాయికి చేరుకున్న నాగలక్ష్మి సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.

కొంతకాలం క్రితం నాగలక్ష్మి మహిళా శిరోమణి అవార్డ్ ను అందుకున్నారు. """/" / అనంతపూర్ జిల్లా( Anantapur )లోని ఆడదాకులపల్లి తండాకు చెందిన నాగలక్ష్మి కుటుంబానికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు.

కుటుంబంలో ముగ్గురూ ఆడపిల్లలే కావడంతో తల్లీదండ్రులు మరింత ప్రేమగా చూసుకున్నారు.ముగ్గురు అక్కాచెల్లెళ్లలో నాగలక్ష్మి పెద్దకూతురు కాగా కుటుంబానికి ఆసరగా నిలవాలనే ఆలోచనతో ఆమె కూడా కూలిపనులకు వెళ్లేవారు.

చదువును నిర్లక్ష్యం చేయకుండానే కష్టపడి నాగలక్ష్మి పనిచేసేవారు. """/" / మదనపల్లిలో పదో తరగతి పూర్తి చేసిన నాగలక్ష్మి( Nagalakshmi ) అనంతపురంలో డిగ్రీ పూర్తి చేశారు.

సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఏ, ఎం.

ఫిల్ చదివిన నాగలక్ష్మి నాన్న మరణం తర్వాత చెల్లెళ్లు లైఫ్ లో స్థిరపడేలా చేశారు.

గ్రూప్స్ కు సిద్ధమైన నాగలక్ష్మికి మొదట ఉపాధి కల్పనాధికారిగా జాబ్ లో చేరారు.

ఆ జాబ్ సంతృప్తిని ఇవ్వకపోవడంతో గ్రూప్స్ రాసి శ్రీకాకుళంలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అటెండెంట్ సూపరిండెంట్ గా ఆమె విధుల్లో చేరారు.

ఒక్కో మెట్టు ఎదిగిన నాగలక్ష్మి ప్రస్తుతం జాయింట్ కమిషనర్( Joint Commissoner ) గా పని చేస్తున్నారు.

ఉద్యోగ బాధ్యతలలో భాగంగా సారా తయారీని అంతమొందించే బాధ్యతను ఆమె భుజాలపై వేసుకున్నారు.

50 సంవత్సరాలలోపే మద్యం అలవాటు వల్ల నాన్న చనిపోయారని నాగలక్ష్మి పేర్కొన్నారు.తండా వాసులతో బంజారా భాషలో మాట్లాడి చైతన్యం తీసుకొనిరావడానికి ప్రయత్నించానని నాగలక్ష్మి తెలిపారు.

సారా తయారీకి భూమి ఇచ్చిన వాళ్లపై కూడా కేసులు పెడుతున్నామని నాగలక్ష్మి కామెంట్లు చేయడం గమనార్హం.

సుధీర్ బాబు ఎందుకోసం మాస్ సినిమాలు చేస్తున్నాడు..?