త్వరలోనే కాంగ్రెస్ నేతల ఉమ్మడి బస్సు యాత్ర
TeluguStop.com
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు అందరూ కలిసి త్వరలోనే ఉమ్మడిగా బస్సు యాత్ర చేయనున్నారని తెలుస్తోంది.
ఇవాళ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో ముఖ్యనేతలు కీలక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ భేటీలో పార్టీలో చేరికల అంశంతో పాటు కొల్లాపూర్ సభ, కార్యాచరణపై నాయకులు చర్చించారు.
అదేవిధంగా ఈనెల 22న పీఏఎసీ సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది.త్వరలోనే ఉమ్మడిగా బస్సు యాత్ర చేయాలని కూడా ఈ సమావేశంలో నేతలు నిర్ణయం తీసుకున్నారని సమాచారం.