6 గ్యారంటీల అమలుతోనే పార్టీలో చేరికలు: మాజీ మంత్రి

సూర్యాపేట జిల్లా: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు ఆరు నెలల వ్యవధిలోనే అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీదేనని మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి,ఏఐసీసీ సభ్యులు రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు.

గురువారం జిల్లా కేంద్రంలోని వైట్ హౌజ్ లో ఆత్మకూర్(ఎస్) మండలంలోని మంగలి తండా మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు లూనావత్ నాగరాజుతో పాటు 50 మంది కార్యకర్తలు, నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వారికి కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.

కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నుండి భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని,రానున్న రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ సూచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గం ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేయడంతో అన్నదాతలు ఆనందంగా ఉన్నారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందన్నారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో కృష్ణ,అమృ,కీర్య నాయక్,గణేష్,డి.

సైదులు, శ్రీను,కాళు,సైదులుతో పాటు మరో 50 మంది కార్యకర్తలు ఉన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ సీనియర్ నాయకులు సత్తిరెడ్డి,మద్ది సుధాకర్ రెడ్డి,ఎలిమినేటి రమేష్,కౌన్సిలర్ ఎలిమినేటి అభినయ్,తన్నీరు చిన్న నరసయ్య,దవుడ,ఎల్.

రామ్మూర్తి,కాలు,నరేందర్ నాయుడు పాల్గొన్నారు.

అన్నయ్యా.. నా గుండె బద్ధలైంది.. రవితేజ ఫ్యాన్ ఎమోషనల్ లెటర్ వైరల్!