జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కీలక నిర్ణయం.. ఆ బేబీ పౌడర్‌కు ఇకపై గుడ్‌బై!

తల్లిదండ్రులు తమ చిన్నపిల్లల చర్మ ఆరోగ్య సంరక్షణ కోసం తప్పనిసరిగా పౌడర్స్‌ కొనుగోలు చేస్తుంటారు.

అయితే ఈ పౌడర్స్‌లో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ బేబీ టాల్కమ్‌ పౌడర్‌ చాలా పాపులర్ అయ్యింది.

అనేక కంపెనీలు చిన్నారుల కోసం పౌడర్లు తీసుకొచ్చినా ప్రపంచవ్యాప్తంగా దీన్ని తప్ప మిగతా వాటిని కొనుగోలు చేయడం లేదు.

అలా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టాల్కమ్‌ పౌడర్‌ పోటీ లేని ప్రొడక్ట్‌గా నిలిచిపోయింది.

అయితే ఆ టాల్కమ్‌ పౌడర్‌ను 2023 నుంచి ప్రపంచవ్యాప్తంగా విక్రయించడం ఆపేస్తామని కంపెనీ తాజాగా చెప్పి షాక్ ఇచ్చింది.

టాల్క్‌ ఆధారిత బేబీ పౌడర్‌ను నిలిపివేసి మొక్కజొన్న పిండి ఆధారిత పౌడర్ తీసుకొస్తామని ప్రకటించింది.

ఈ నిర్ణయం తీసుకోవడానికి టాల్కమ్‌ పౌడర్‌తో క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని చాలా మంది ఆరోపణలు చేయడమే కారణం.

ఈ ఆరోపణలను ఖండించిన కంపెనీ పౌడర్‌ సేఫ్ అని, ఇప్పటికే ఆ మాటలకు కట్టుబడి ఉంటామని చెప్పింది.

అయితే, ఇందులో వాడే ఆస్‌బెస్టాస్‌ క్యాన్సర్‌కు కారకమని పరిశోధనలు వెల్లడించాయి.ఆ సమయం నుంచి తమ పిల్లలకు దీనివల్లే క్యాన్సర్ వచ్చినట్లు వేలాది మంది ప్రజలు కోర్టుల్లో కేసులు వేశారు.

ఆ కేసుల కారణంగా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది.

"""/" / ఈ పౌడర్‌ను ఇంకా కొనసాగిస్తే కేసులు పెరగడం, వాటి సెటిల్మెంటు, తీర్పుల కోసం భారీ ఎత్తున డబ్బులు ఖర్చు చేయడం ఎందుకని దీనిని ఆపేయాలని కంపెనీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ పౌడర్ విక్రయాలు తగ్గడం కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం.

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ బేబీ టాల్కమ్‌ పౌడర్‌ చిన్నపిల్లల చర్మాన్ని పొడిగా ఉంచుతూ దద్దుర్లు దరిచేరనివ్వకుండా సంరక్షిస్తుంది.

వావ్, వాట్ ఏ జీనియస్ జాకెట్.. జపనీయులు మామూలోళ్లు కాదు..