మన మాస్టర్ ను వదలని అక్కడి సూపర్‌ స్టార్స్‌

తెలుగు డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఒకప్పుడు ప్రముఖ డాన్స్ షోలో పాల్గొన్న జానీ మాస్టర్ ని జడ్జి నీకు డాన్స్‌ రాదు అంటూ అవమానించి షో నుంచి బయటికి పంపించడం జరిగింది.

ఆ అవమానం ను జానీ మాస్టర్ భారంగా భావించకుండా చాలెంజ్ గా తీసుకుని జీవితం లో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని ఇప్పుడు ఎంతో మంది హీరో లకు సీనియర్ సూపర్ స్టార్ ల సినిమా లకు కొరియోగ్రఫీ చేస్తున్నాడు.

తెలుగు లో ఇన్నాళ్లు వరుసగా స్టార్ హీరో లకు కొరియోగ్రాఫర్ గా మారిన జానీ మాస్టర్ ఇప్పుడు తమిళ నాట వరుస చిత్రాల తో కొరియోగ్రాఫర్ గా అక్కడ బిజీ అయ్యాడు.

సాధారణంగా తమిళ కొరియోగ్రాఫర్లు చాలా మంది తెలుగు లో స్టార్స్ గా మారారు.

ఇప్పుడు జానీ మాస్టర్ తమిళం లో సూపర్ స్టార్ విజయ్ తో పాటు ఇంకా కొందరు స్టార్ హీరో లకు కొరియోగ్రఫీ చేసి అక్కడ స్టార్ అయ్యాడు.

ఇటీవల విజయ్ నటించిన బీస్ట్‌ సినిమా నుండి వచ్చిన మొదటి పాట ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే.

ఆ పాటకు కొరియోగ్రఫీ జానీ మాస్టర్ చేశారు.ఇప్పుడు ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ఆ పాట వైరల్ అవుతుంది.

"""/"/ అరబిక్ కుత్తు డాన్స్ స్టెప్పులను ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫాలో అవుతున్నారు.

సోషల్‌ మీడియాలో అరబిక్ కుత్తు ట్రెండ్ ఇంకా కొనసాగుతున్న సమయంలోనే జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన విజయ్ రెండో పాట కూడా విడుదలకు సిద్ధమైంది.

ఈ పాట కూడా ఆయన కొరియోగ్రఫీ చేయడంతో కచ్చితంగా అద్భుతమైన స్టెప్స్ ఉంటాయని అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు నెల్సన్‌ దిలీప్‌ దర్శకత్వం వహించాడు.

ఈ సినిమా ను సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం అంటూ అధికారికంగా ప్రకటించారు.

లక్షెట్టిపేటలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి