సలార్ సినిమాలో మరొక బాలీవుడ్ హీరో నటిస్తున్నాడా..?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత వరస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం ప్రభాస్ నాలుగు పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టాడు.అందులో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న సలార్ సినిమా ఒకటి.

ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

సలార్ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికం గా ప్రకటించారు.

శృతి హాసన్ ఈ సినిమాలో జర్నలిస్ట్ గా నటిస్తుంది.ప్రభాస్ తొలిసారి శృతి హాసన్ తో నటిస్తున్నాడు.

అందుకే ఫ్యాన్స్ ఈ జంట తెరమీద ఎలా ఉంటదా అని ఉహించు కుంటున్నారు.

ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఈ సినిమాను ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు.

"""/"/ తాజాగా ఈ సినిమాపై ఒక వార్త వైరల్ అవుతుంది.ఈ సినిమాలో బాలీవుడ్ హీరో కూడా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అది ఎవరో కాదు జాన్ అబ్రహం అని తెలుస్తుంది.ఈయన పాత్ర కేవలం గెస్ట్ రోల్ లాగా ఉంటుందట.

అయితే విలన్స్ ను లీడ్ చేసే మెయిన్ రోల్ లో ఇతడు నటిస్తున్నాడని.

జాన్ అబ్రహం మెయిన్ విలన్ రోల్ లో నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.మరి ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 14 న విడుదల కానుంది.

ప్రభాస్ ఈ సినిమాతో పాటు రాధాకృష్ణ డైరెక్షన్ లో రాధే శ్యామ్ సినిమా, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా, అలాగే నాగ్ అశ్విన్ తో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై వర్మ సంచలన పోస్ట్.. మెగాబలి అంటూ కామెంట్స్!