ఒక్కొక్క వ్యవస్థను గాడిలోకి.. ఇప్పుడు స్కూళ్లపై ఫోకస్, బైడెన్ కీలక ఆదేశాలు
TeluguStop.com
అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తాను తొలి 100 రోజుల్లో పూర్తి చేయాల్సిన కార్యక్రమాలపై ఓ ప్రణాళిక ప్రకారం వెళ్తున్న జో బైడన్ ఒక్కొక్క పనిని పూర్తి చేస్తున్నారు.
ఇప్పటికే కీలకమైన వలస విధానంలో భాగమైన హెచ్ 1 బీ వీసాలకు పాత లాటరీ పద్ధతిని తీసుకొచ్చారు.
అలాగే హెచ్ 4 వీసాదారుల వర్క్ పర్మిట్‌ల విషయంపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఆయన హామీల్లో ప్రధానమైన కోవిడ్ నిర్మూలనపైనా దృష్టి సారించారు.అమెరికన్ ఆర్ధిక వ్యవస్థకు, కంపెనీలకు ప్రజలకు మేలు కలిగేలా భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు.
ఇప్పుడు విద్యారంగంపై ఫోకస్ చేశారు జో బైడెన్.కోవిడ్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో విద్యారంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
పిల్లల ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకుని స్కూళ్లను మూసివేసిన ప్రభుత్వం ఆన్‌లైన్ క్లాసులకు అనుమతినిచ్చింది.
ఈ క్రమంలో మూతబడిన పాఠశాలలను తిరిగి ప్రారంభించడానికి బైడెన్ ఆదేశాలు జారీ చేశారు.
ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేశారు.దేశంలో వీలైనన్ని ఎక్కువ పాఠశాలలను తక్కువ కాలంలో సురక్షితంగా తెరవడం తన లక్ష్యాల్లో ఒకటి అన్నారు జో బైడెన్.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన మొదటి మూడు వారాల్లోనే కరోనా విషయంలో మంచి ఫలితాలు రాబట్టామన్నారు.
గతేడాది ఎన్నో త్యాగాలు చేశామని.విద్యార్థులకు, విద్యావేత్తలకు, సమాజానికి అవసరమైన వనరులతో మద్దతివ్వాల్సిన సమయం ఆసన్నమైందని బైడెన్ అభిప్రాయపడ్డారు.
పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు తరగతి గదులను శుభ్రపరచడం , విద్యార్థుల మధ్య సామాజిక దూరం, మాస్క్ ధరించడం వంటి నిబంధనల పాటించాలని సూచించారు.
మరోవైపు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ (సీడీసీ) కూడా పాఠశాలల ప్రారంభంపై కీలక సూచనలు చేసింది.
పాఠశాల బస్సులు, తరగతి గదుల్లో విద్యార్థులు సామాజిక దూరం పాటించడం, ముఖానికి మాస్క్ ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం చేయాలని తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌లో కొనసాగుతోంది.ఇండియా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇక మొత్తం కరోనా మరణాల్లోనూ అమెరికా టాప్‌లో ఉండగా.బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
బాలయ్యకు పద్మభూషణ్ రావటం ఆ హీరోకి నచ్చలేదా… అందుకే సైలెంట్ గా ఉన్నారా?