బిడెన్ సంచలన హామీ..మండిపడుతున్న అమెరికన్స్..!!!

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కేవలం 18 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.

ఇరు అధ్యక్ష్య అభ్యర్ధుల మధ్య పోరులో ఎవరు అగ్ర రాజ్యానికి అధిపతి అవుతారనేది త్వరలో తేలిపోనుంది.

అమెరికన్స్ ఓట్లు పక్కన పెడితే వలస వాసుల ఓట్లు కూడా గెలుపులో కీలక పాత్ర పోషించనున్నాయి.

దాంతో ట్రంప్ బిడెన్ ఇరువురు వారి ఓట్ల కోసం హామీల వర్షం గుప్పిస్తున్నా వారికి పూర్తి భరోసా ఇచ్చిన సందర్భాలు లేవు.

కానీ తాజాగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి బిడెన్ మాత్రం వలస వాసులకు పౌర సత్వం విషయంలో పూర్తి హామీ ఇచ్చారు.

అమెరికాలో ఉంటున్న సుమారు 1.1 కోట్ల మంది వలస వాసులను ఉద్దేశించి మాట్లాడిన బిడెన్ ప్రతీ ఒక్క వలస వాసికి అమెరికా పౌరసత్వం ఇస్తాననిప్రకటించారు.

బిడెన్ ఇచ్చిన ఈ తాజా హామీ ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా పెద్ద చర్చనీయంసం అవుతోంది.

కరోనా మహమ్మారిపై పోరాటం, ఆర్ధిక అభివృద్ధి , ప్రపంచ వ్యాప్తంగా అమెరికాని పూర్తి స్థాయి అగ్ర రాజ్యంగా నిలపడంతో పాటు వస వాసుల సమస్యలు కూడా ప్రధానంగా పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు.

వాషింగ్టన్ లో నిధుల సేకరణ సమయంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్ తాను అధికారంలోకి వస్తే తప్పకుండా వలస వాసులకు అమెరికా పౌరసత్వం ఇస్తానని ప్రకటించారు.

ఇమ్మిగ్రేషన్ బిల్లును సెనేట్ కి పంపుతానని తద్వారా వలస వాసులు ప్రతీ ఒక్కరూ అమెరికా పౌరసత్వం పొందుతారని తెలిపారు.

అయితే బిడెన్ ఇచ్చిన ఈ తాజా హామీతో అమెరికన్స్ మండిపడుతున్నారని స్థానిక మీడియా తెలిపింది.

ఒక పక్క అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలస వాసులను కట్టడి చేస్తూ అమెరికన్స్ కి ఉద్యోగాలను కల్పించాలని అమెరికన్స్ కి న్యాయం చేసేలా ప్రయత్నాలు చేస్తుంటే బిడెన్ మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు అమెరికన్స్.

కేరళ టూరిజం గురించి లండన్‌లో ప్రచారం.. ఎలాగంటే..