ఏం పీక్కుంటావో పీక్కో..బిడెన్ డేరింగ్ స్టెప్..!!!
TeluguStop.com
అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తరువాత ట్రంప్ ప్రవర్తనా సరళిలో పూర్తిగా మార్పు వచ్చింది.
ప్రజా ఆమోదయోగ్యంగా బిడెన్ అత్యధిక మెజారిటీతో గెలిచినా, ట్రంప్ మాత్రం విజయం తనదేనని, వైట్ హౌస్ విడిచి వెళ్ళేది లేదని తేల్చి చెప్పేస్తున్నారు.
బిడెన్ వర్గం తమని మోసం చేసి గెలిచిందని, చాలా చోట్ల ఎన్నికలు సజావుగా జరగలేదని చాలా ప్రాంతాలలో ఎన్నికల నిర్వహణపై తమకు పలు సందేహాలు కూడా ఉన్నాయని ట్రంప్ కోర్టులకెక్కారు.
కోర్టులలో కేసులు వేయడం ద్వారా అమెరికాలో అలజడి సృష్టించే ప్రయత్నం చేయాలని భావించిన ట్రంప్ పనిలో పనిగా అధికారులకు ఉద్యోగులకు కూడా ఓ సందేశాన్ని ఇచ్చారు.
అధికార మార్పిడి కోసం వస్తున్నా బిడెన్ టీమ్ కు ఎవరూ కూడా సహకరించవద్దని ట్రంప్ స్పష్టం చేశారు.
అధికార మార్పిడి చేయడానికి బిడెన్ అధ్యక్షుడు కాదని ట్రంప్ ఘాటుగానే స్పందించారు.దాంతో ఒళ్ళు మండిన బిడెన్ ట్రంప్ వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చారు.
"""/"/
అమెరికాకి ప్రస్తుతం ట్రంప్ అధ్యక్షుడు కావచ్చు కానీ త్వరలో తానె అధ్యక్షుడిననే విషయం ట్రంప్ గుర్తుపెట్టుకోవాలని అధ్యక్షుడిగా ట్రంప్ చట్ట వ్యతిరేక సంకేతాలు పంపడం మంచిది కాదని వ్యాఖ్యానించారు.
అంతేకాదు అధికార మార్పిడి విషయంలో ఎలాంటి అడ్డంకులు లేవని ఒక వేళ అధికార మార్పిడి విషయంలో ట్రంప్ యంత్రాంగం వ్యతిరేకించినా తమకు ఎలాంటి నష్టం లేదని మేము చేయాల్సిందే మేము చేస్తామని ఏం చేయాలని అనుకుంటున్నారో అదే చేయమని గట్టిగా బదులిచ్చారు.
జనవరి 20 తరువాత జరిగేది చూడాలని, అప్పుడు నడిచేది బిడెన్ ప్రభుత్వమేనని గుర్తుపెట్టుకోవాలని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.
విశ్వక్ సేన్ పరిస్థితి ఏంటి..? ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరో అవుతారా..?