కరోనా అంతు చూస్తాం..కొత్త టీమ్ తో సిద్దమైన బిడెన్..!!

అమెరికా వాప్తంగా కరోనా ధాటికి అమెరికన్స్ పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు.మృతి చెందిన వారితో శవాల దిబ్బలు ప్రత్యక్షం అవుతున్నాయి.

పరిస్థితి మరింత జటిలం అవుతోంది.ఎలా ఈ మహమ్మారిని ఎదుర్కోవాలో తెలియని పరిస్థితిలో ప్రభుత్వం సైతం ఆందోళనలో ఉంది.

అయితే కరోనా పై పోరు చేయడానికి పక్కా ప్రణాళిక అవసరమని అందుకు నిపుణులైన వ్యక్తులతో కూడా టీమ్ అవసరమని గ్రహించిన బిడెన్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు.

కరోనాపై యుద్ధం చేయడం కోసం నిపుణులతో టీమ్ సిద్దం చేశాడు.అమెరికా ఆరోగ్య శాఖ, హ్యూమన్ సర్వీసెస్ మంత్రిగా అత్యంత అనుభవం గల హవియర్ బెసరా ను ఎంపిక చేశాడు.

అలాగే అమెరికా సర్జన్ జనరల్ గా ఇండో అమెరికన్ అయిన వివేక్ మూర్తి ని బిడెన్ ఎంపిక చేశారు.

ఇక అధ్యక్షుడి చీఫ్ మీడియాల్ ఎడ్వైజరీ గా ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని పౌచీ ని నియమించారు బిడెన్.

అలాగే వ్యాధులను నియంత్రించే కేంద్రాలకు అధిపతిగా డాక్టర్ రోచేల్ ను నియమించారు బిడెన్.

ఇక కరోనా ఈక్వేడిటీ టాస్క్ ఫోర్సు అధినేతగా డాక్టర్ మార్సేలా స్మిత్ భాద్యతలు చేపట్టనున్నారు.

"""/"/ కరోనా మహమ్మారి కారణంగా అమెరికా త్వరలో అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందని, కానీ దీన్ని నిలువరించడానికి పరిస్థితులు మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రస్తుతం ఏర్పాటైన టీమ్ సమర్ధవంతగా పనిచేస్తుందని బిడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

హెల్త్ కేర్ టీమ్ లోని నిపుణులు సూచిన విధానాలను తప్పకుండా పాటిస్తామని తద్వారా కరోనా వ్యాప్తిని నియంత్రిస్తామని తెలిపారు బిడెన్.

మా ముందు ఉన్న అతిపెద్ద సవాల్ అమెరికా ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడం రెండు కరోనా ను నియంత్రించడమే నని బిడెన్ ప్రకటించారు.

నెల్లూరు కూటమి రోడ్ షోలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!