సైకిల్‌పై నుంచి కింద పడ్డ జో బైడెన్.. వీడియో వైరల్!

ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వయసు అక్షరాలా 79 ఏళ్లు.చరిత్రలో అతను తప్ప ఇంత పెద్ద వయసున్న వారెవరూ కూడా యూఎస్ అధ్యక్షుడిగా కొనసాగలేదు.

అందుకే యూఎస్ ప్రెసిడెంట్ అయిన అతిపెద్ద వయస్కుడిగా బైడెన్ చరిత్ర సృష్టించాడు.అయితే ఇదంతా బాగానే ఉంది కానీ అతను తన వృద్ధాప్యం వల్ల కొన్ని సార్లు పబ్లిక్‌లోనే కింద పడుతూ, నిద్రపోతూ అందరినీ షాక్‌కి గురి చేస్తున్నారు.

ఇలా తూలి పడుతూ, నిద్రపోయే బైడెన్ అగ్రరాజ్యాన్ని ఎలా ముందుండి నడిపిస్తారు? అని ఆ దేశ ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మరోసారి బైడెన్ కిందపడిపోయారు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రపంచ దేశాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

ప్రథమ మహిళ జిల్ బైడెన్‌, జో బైడెన్‌ ఇటీవలే తమ 45వ వార్షిక వివాహ దినోత్సవం జరుపుకున్నారు.

ఈ సందర్భంగా వారాంతపు సెలవుల్లో భాగంగా బైడెన్ డెలావేర్ రాష్ట్రంలోని బీచ్ హోమ్ వద్ద కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు.

శనివారం రోజు ఆయన కేప్ హెన్లోపెన్ పార్కులో సైకిల్ తొక్కుతూ కొంత దూరం వరకు ప్రయాణించారు.

అయితే ఆ పార్క్‌కు తనను చూసేందుకు చాలా మంది తరలి రావడంతో వారిని కలవడానికి బైడెన్ సైకిల్ తొక్కడం ఆపేసారు.

దాన్నుంచి కిందకి దిగాలి అనుకున్నారు. """/"/ ఈ క్రమంలోనే బ్యాలెన్స్ తప్పారు.

ఇందుకు కారణం సైకిల్ పెడల్‌లో ఆయన కాలు ఇరుక్కుపోయింది.అంతే అతను ఒకేసారి నేలపై పడిపోయారు.

దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు.ఇది చూసి పక్కనే ఉన్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయనకు చెయ్యందించారు.

కింద పడిన క్షణాల్లోనే పైకి లేచిన బైడెన్ తనకేం గాయాలు కాలేదని తెలిపారు.

అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు.అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

పవన్ ఆద్య క్యూట్ సెల్ఫీ… రేణు దేశాయ్ రియాక్షన్ ఇదే!