స్థానికులకే ఉద్యోగాలు సీఎం జగన్…కలెక్టర్ లకు కీలక ఆదేశాలు..!!

ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది.

ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని పిలవడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం జగన్ ( CM Jagan )కీలక వ్యాఖ్యలు చేశారు.

పరిశ్రమల్లో స్థానికులకే 75% ఉద్యోగాలు వచ్చేలా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు.

ఇదే సమయంలో ఆరు నెలలకు ఒకసారి నివేదిక కూడా పంపాలని సూచించారు.స్థానికులకు 75 శాతం ఉద్యోగాలపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని తప్పకుండా అమలు చేయాలని.

పరిశ్రమలకు అన్ని రకాలుగా తోడుగా నిలవాలని సూచించారు. """/" / ఒక పరిశ్రమ సమర్థవంతంగా నడపాలంటే కచ్చితంగా ఆ ప్రాంత ప్రజల మద్దతు అవసరం.

కాబట్టి రాబోతున్న పరిశ్రమలలో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి అని సీఎం జగన్ స్పష్టం చేశారు.

ఇంకా ఇదే సమయంలో రాష్ట్రంలో మానవ వనరులు ( Human Resources )నైపుణ్య అభివృద్ధికి ఎక్కడా కొరత లేదు.

ఈ క్రమంలో రైతుల వద్ద పంటల ఉత్పత్తు కనీస మద్దతు ధరకు కొనాల్సిందే అని పేర్కొన్నారు.

వ్యవసాయ రంగంలో ఇజ్రాయిల్ తరహా విధానాలను అమలు అయ్యేలా చూడాలని పరిశ్రమల్లో శుద్ధి చేసిన నీరు డి శాలినేషిన్ నీటిని వినియోగించేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.

ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..?