పరిశ్రమలో మరో బెంచ్‌మార్క్‌ను నిర్ధేశించిన జెకె టైర్ ; పంచర్ గార్డ్ టైర్ పరిచయం
TeluguStop.com
పరిశ్రమలో మరో బెంచ్‌మార్క్‌ను నిర్ధేశించిన జెకె టైర్ ; పంచర్ గార్డ్ టైర్ పరిచయం అత్యాధునిక టైర్ సాంకేతికతను భారతదేశంలో తీసుకురావడంతో పాటుగా మరింత భద్రత, సౌకర్యాన్ని వినియోగదారులకు అందించనుంది న్యూఢిల్లీ, 24 మార్చి 2024 భారతదేశపు టైర్ మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తూ రేడియల్ టెక్నాలజీ లో అగ్రామి మరియు సుప్రసిద్ధ టైర్ తయారీదారు జెకె టైర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నేడు నాలుగు చక్రాల వాహనాల కోసం పంక్చర్ గార్డ్ టైర్లను విడుదలచేసింది.
భారతీయ రహదారులకు తగినట్లుగా ఉండేలా సాంకేతికంగా అత్యున్నత పనితీరు కలిగిన టైర్లను ఉత్పత్తి చేయడంలో అగ్రగామిగా నిలిచిన జెకె టైర్, తమ పంక్చర్ గార్డ్ టైర్లతో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులను తీసుకురానుంది.
ఈ పంక్చర్ గార్డ్ టైర్ సాంకేతికతను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.దీనిని ప్రత్యేకంగా తీర్చిదిద్దన సెల్ఫ్ హీలింగ్ ఎలాస్టోమెర్ ఇన్నర్ కోట్‌తో తీర్చిదిద్దారు.
దీనిని టైర్ లోపల అప్లయ్ చేయడం వల్ల పంక్చర్ పడినా గాలి బయటకు పోదు.
ఈ సాంకేతికత కారణంగా ట్రెడ్ టైర్లలో 6.0 మిల్లీ మీటర్ల వ్యాసార్ధం వరకూ కలిగిన పలు పంక్చర్లను స్వయంగా పూడ్చుకోగలదు.
ఈ సందర్భంగా డాక్టర్ రఘుపతి సింఘానియా, ఛైర్మన్ – మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ ‘‘ ఆవిష్కరణల పరంగా జెకె టైర్ ఎల్లప్పుడూ ముందే ఉంటుంది.
2020లో స్మార్ట్ టైర్ టెక్నాలజీ పరిచయం చేయడంతో పాటుగా ఇప్పుడు పంక్చర్ గార్డ్ టెక్నాలజీ పరిచయం చేశాం.
ఈ సాంకేతికత అత్యున్నత స్థాయి భద్రత, సౌకర్యంను వాహన యజమానులకు అందిస్తుంది.
ఆటో ఎక్స్‌పో 2020 వద్ద విడుదలచేసిన కాన్సెప్ట్ టైర్లలో ఈ పంక్చర్ గార్డ్ టైర్ ఓ భాగం’’ అని అన్నారు.
రాజమౌళి సినిమాలో శ్రీరాముడిగా మహేష్.. బాక్సాఫీస్ షేక్ కావడం మాత్రం పక్కా!