గృహనిర్బంధం నుంచి ఫరూఖ్ అబ్దుల్లా కు విముక్తి

దాదాపు 7 నెలల గృహనిర్బంధం నుంచి జ‌మ్మూక‌శ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా బయటపడనున్నారు.

గతేడాది జమ్మూకశ్మీర్‌లో 370 అధికరణ రద్దు నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాను పోలీసులు నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే.

ఏడు నెలల నిర్బంధం అనంతరం ఫరూఖ్‌ అబ్దుల్లా విడుదల కానున్నట్లు తెలుస్తుంది.ఆయనపై విధించిన గృహ నిర్బంధాన్ని ఎత్తివేస్తున్నట్లు జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం ప్రకటించింది.

ప్రజాభద్రత చట్టం కింద ఆయనను ఇన్నాళ్లు గృహనిర్బంధంలో ఉంచారు.ప‌బ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్ర‌కారం ఆయ‌న్ను అరెస్టు చేసిన అధికారులు ఇప్పుడు 7 నెలల గ్యాప్ తరువాత విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

83 ఏళ్ల ఫారూక్‌తో పాటు ఆయ‌న కుమారుడు ఒమ‌ర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహ‌బూబా ముఫ్తీల‌ను కూడా నిర్భ‌ధించారు.

అయితే గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో ఒమ‌ర్ అబ్ధుల్లాపై పీఎస్ఏను ప్ర‌యోగించిన విషయం తెలిసిందే.

ఆ చ‌ట్టం ప్రకారం ఎటువంటి విచార‌ణ లేకుండా రెండేళ్లు నిర్బంధంలో ఉంచ‌వ‌చ్చు అన్న మాట.

"""/"/ అయితే ప్ర‌జా వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న్ను అరెస్టు చేసిన అధికారులు పీఎస్ ఏ ను ప్రయోగించారు.

సాధార‌ణంగా పీఎస్ఏ చ‌ట్టాన్ని ఉగ్ర‌వాదులు, వేర్పాటువాదులు, రాళ్లు రువ్వే అల్ల‌రి మూక‌ల‌పై ప్ర‌యోగిస్తారు.

కానీ తొలిసారి కేంద్ర ప్ర‌భుత్వం ప‌లువురు ప్ర‌ధాన రాజ‌కీయ నేత‌ల‌ను అదుపులోకి తీసుకొని ఒమర్ అబ్దుల్లా పై ఈ చట్టాన్ని ప్రయోగించింది.

అయితే ఫారూక్ అబ్దుల్లా కు గృహనిర్బంధం నుంచి విముక్తి కలిగిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అంతర్జాతీయ విద్యార్ధులకు భారత్ శుభవార్త .. కొత్తగా రెండు స్పెషల్ వీసాలు