నేడు తెలంగాణ గవర్నర్ గా జిస్టు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్:జులై 31 తెలంగాణ గర్నవర్‌గా నియామకమైన జిష్ణుదేవ్ వర్మ ఈరోజు పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

రాజ్‌భవన్‌లో బుధవారం సాయంత్రం 5.03 గంటలకు ఆయన గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు రాజ్‌భవన్‌ పేర్కొంది.

రెండురోజుల కిందట కేంద్ర ప్రభుత్వం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియ మించిన విషయం తెలిసిందే.

జిష్ణుదేవ్ వర్మ 2018 నుంచి 2023 వరకూ త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పని చేశారు.

1957 ఆగస్టు 15న స్వా తంత్ర దినోత్సవం రోజున జిష్ణుదేవ్ వర్మ జన్మించారు.

అంతేకాదు గతంలో బాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షు డిగా సేవలందించారు.ఈయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి కాగా.

రామ జన్మభూమి ఉద్యమ సమయంలో పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమ యంలో పార్టీలో 1990లో చేరారు.

ఆయన అప్పటి నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవ హరిస్తూ వచ్చారు.త్రిపుర ప్రభుత్వంలో ఆయన మంత్రి గా విద్యుత్, గ్రామీణాభి వృద్ధి, పంచాయితీ రాజ్, ఆర్ధిక, ప్రణాళిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖల బాధ్యతలను నిర్వర్తించారు.

యాక్టింగ్‌లో సూర్యనే డామినేట్ చేసిన నటి.. ఆమెకు తిరుగు ఉండదు..