జియో కస్టమర్లకు శుభవార్త.. ఇక ఎమర్జెన్సీ లోన్ కూడా..!
TeluguStop.com
జియో సిమ్ వినియోగదారులకు దిగ్గజ రిలయన్స్ జియో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.
ప్రీపెయిడ్ కస్టమర్లకు జియో ఎమర్జెన్సీ డేటా ప్లాన్ లోన్‌ను అందించనున్నట్లు తెలిపింది.రీఛార్జ్ నౌ పే లేటర్ ద్వారా తక్షణ డేటాను అందిస్తోంది.
ఆ వివరాలు తెలుసుకుందాం.కొన్ని సందర్భాల్లో డేటా అయిపోయిన వెంటనే తక్షణమే రీఛార్జ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.
ఇక జియో కస్టమర్ల డేటాకు బ్రేక్ పడకుండావీరి కోసమే ఈ అద్భుతమైన ఆఫర్‌ను తీసుకువచ్చింది.
వారికి ఎమర్జెన్సీ డేటా లోన్ సదుపాయాన్ని అందించనుంది.దీంతో వారు ముందు రీఛార్జ్ చేసుకున్నాక తర్వాత డబ్బులు చెల్లించవచ్చు.
ఈ ఆఫర్‌నుమై జియో యాప్‌ద్వారా అందిస్తోంది.h3 Class=subheader-styleడేటా లోన్ పొందే విధానం/h3p """/"/
ముందుగా జియో కస్టమర్లు మై జియో యాప్‌ను ఓపెన్ చేయాలి.
మొబైల్ నంబర్ ఆధారంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.ఆ తర్వాత ‘ మెను’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
అందులో ‘ఎమర్జెన్సీ డేటా లోన్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ప్రొసీడ్ బటన్ క్లిక్ చేయాలి.
అప్పుడు గెట్ ఎమర్జెన్సీ డేటా ఆప్షన్ కనిపిస్తుంది.దాన్ని ఎంచుకోవాలి.
ఇక అందులోకి ‘యాక్టీవ్ నౌ’ అనే అప్షన్ ఎంచుకుంటే మీకు డేటా ఎమర్జెన్సీ లోన్ లబ్ది పొందుతారు.
H3 Class=subheader-styleడేటా ధరలు/h3p """/"/
జియో ఎమర్జెన్సీ డేటా లోన్ ద్వారా వినియోగదారులకు 5 ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
1 జీబీ నుంచి మొదలవుతుంది.(ఇది రూ.
11 ప్యాకేజీ).గరిష్టంగా రూ.
55 లేదా అయిదు ప్యాకేజీలను పొందే అవకాశం ఉంటుంది.h3 Class=subheader-styleచెల్లించే విధానం/h3p
ఈ ఎమర్జెన్సీ డేటా లోన్ తీసుకున్న కస్టమర్లు డబ్బులు చెల్లించే విధానాన్ని తెలుసుకుందాం,
దీనికి మై జియో యాప్ లోని మెనూ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
మొబైల్ సర్వీసెస్ ఆప్షన్‌లోని ఎమర్జెన్సీ డేటా లోన్ పై క్లిక్ చేయాలి.ఆ తర్వాత ప్రొసీడ్‌ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఈ తర్వాత లోన్ పే చేయడానికి అక్కడ లోన్ అమౌంట్ మొత్తం కనిపిస్తుంది.
ఏదైనా పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోని డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది.ఎమర్జెన్సీ డేటా లోన్ పొందడానికి ఆటో రిసెట్ ఆప్షన్ కూడా జియో అందుబాటులోకి తీసుకువచ్చింది.
గతంలో ఐడియా, ఎయిర్‌టెల్ కస్టమర్లకు టాక్‌టైమ్ అడ్వాన్స్ లోన్ అందుబాటులో ఉండేది.ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వాటిని తొలగించారు.
కేవలం వారంలోనే డార్క్ సర్కిల్స్ ను మాయం చేసే ఎఫెక్టివ్ రెమెడీస్ ఇవి..!