జియో యూజర్స్ పై భారీ బాదుడు షురూ..!

గత కొన్ని రోజుల క్రితమే ప్రముఖ టెలికాం సంస్థలు అయిన వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ తమ ప్రీపెయిడ్ చార్జీలను 20% మేర పెంచిన విషయం అందరికి తెలిసిందే.

అయితే ఇప్పుడు వారి బాటలోనే ముఖేష్ అంబాని కూడా అదే మాదిరి అడుగులు వేస్తున్నాడు.

ఆయన సంస్థలలో రిలయన్స్ జియో టెలికాం సంస్థ కూడా ఒకటి.ఒకప్పుడు అతి తక్కువ టారిఫ్ చార్జీలతో కస్టమర్లను ఆకట్టుకున్న జియో ఇప్పుడు తన ప్రీపెయిడ్ టారిఫ్‌ లను 20% వరకూ పెంచుతూన్నట్లు ప్రకటన.

జియో కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్‌ లు 2021 డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.

ఈ క్రమంలోనే జియో తన యూజర్ల కోసం ఒక ప్రకటన కూడా జారీ చేసింది.

ఒక ఖచ్చితమైన టెలికాం పరిశ్రమను మరింత బలంగా చేయాలనే ఆలోచనతో, అలాగే ప్రతీ భారతీయుడు కూడా బెస్ట్ క్వాలిటీ కాలింగ్, బెస్ట్ క్వాలిటీ ఇంటర్నెట్ యొక్క డిజిటల్ అనుభూతిని ఆస్వాదించాలనే దృఢ నిశ్చయంతో జియో ఉందని, అందుకు అనుగుణంగానే ప్రస్తుతం ఉన్న ప్లాన్‌లలో కొద్ది మార్పులు చేయాలిసిన పరిస్థితి వచ్చింది అని జియో ప్రకటించింది.

మరి కొత్తగా అందుబాటులోకి వచ్చిన జియో ప్లాన్‌ల ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామా.

ప్రస్తుతం 28 రోజుల వాలిడిటీతో ఉన్న 75 రూపాయల జియో ప్లాన్ ధరని 91 రూపాయలకు పెంచడం జరిగింది.

అలాగే అన్లిమిటెడ్ ప్లాన్స్ విషయానికి వస్తే 129 రూపాయిల ప్లాన్ ను 155 రూపాయలకు పెంచడం జరిగింది.

ఈ ప్లాన్ కేవలం 28 రోజుల వాలిడిటీ తో ముగుస్తుంది.అలాగే 24 రోజుల వాలిడిటీ తో ఉన్న 149 రూపాయిల ప్లాన్ 155 రూపాయలకు పెంచబడింది.

అలాగే 199 రూపాయిల ప్లాన్ 239 రూపాయిలు, 249 రూపాయిల ప్లాన్ 299 రూపాయలకు పెంచడం జరిగింది.

ఇవన్నీ కేవలం 28 రోజుల వాలిడిటీ ప్లాన్స్ మాత్రమే.కాగా 399 రూపాయిలతో ఉన్న 56 రోజుల వాలిడిటీ ప్లాన్ 479కి పెరిగింది.

అలాగే 444 రూపాయిల ప్లాన్ 533 రూపాయలకు పెరిగింది.అపరిమిత కాలింగ్, 6జీబీతో 84 రోజుల వ్యాలిడిటీ గల ప్లాన్ ధర గతంలో రూ.

329 ఉండేది.కానీ ఇప్పుడు 395 రూపాయిలు అయింది.

"""/"/ అలాగే 84 రోజుల కాలపరిమితితో ఉన్న రోజుకు 1.5 జిబి డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్ ప్లాన్స్ తో అందుబాటులో ఉన్న ప్లాన్ గతంలో 599 రూపాయలుగా ఉంటే ఇప్పుడు అది కాస్త 666 రూపాయలుగా పెరిగింది.

అలాగే 599 రూపాయిల ప్లాన్ 719 రూపాయలుగా పెరిగింది.336 రోజుల వాలిడిటీ, 24 జిబి అపరిమిత కాలింగ్, 3600 ఎస్సెమ్మెస్ ప్లాన్ గతంలో 1299 రూపాయలుగా ఉంటే ఇప్పుడు అది 1559 రూపాయలకు పెరిగింది.

అలాగే 365 రోజుల వార్షిక ప్లాన్ గతంలో 2399 రూపాయిలాగా ఉండగా అది 2879 రూపాయలకు పెరిగింది.

పెరిగిన ఈ ప్లాన్ ధరలు అన్నిఈ సంవత్సరం డిసెంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.

ఆ సర్వే లెక్కలు నిజమైతే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారా.. అక్కడ వైసీపీదే విజయమా?