టాలీవుడ్ లో జియో అడుగు పెడితే వాళ్లు చాప చుట్టేయడమే!

రంగం ఏదైనా రిలయన్స్ వారు అక్కడ అడుగు పెడితే మార్కెట్ మొత్తం అంబానీ చుట్టు తిరగడం మనం చూస్తూనే ఉన్నాం.

తాజాగా ఓటీటీ మార్కెట్ లో ( OTT ) రిలయన్స్ జియో అడుగు పెట్టింది.

ఇన్నాళ్లు జియో సినిమా( Jio Cinema ) అంటూ ఉచిత సర్వీస్ ను అందించిన జియో సినిమా ఐపీఎల్‌ ను స్ట్రీమింగ్ చేయడం ద్వారా భారీ రెస్పాన్స్ ను దక్కించుకుంది.

దాంతో ఇక మీదట భారీ మొత్తాన్ని డిమాండ్‌ చేసేందుకు సిద్ధం అయ్యింది.అమెజాన్ ప్రైమ్‌ రేంజ్ లో జియో సినిమా యొక్క ఖాతాదారుల నుండి వసూళ్లు చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తోంది.

అదే నిజం అయితే కచ్చితంగా జియో సినిమా నుండి భారీ మొత్తంలో కంటెంట్ ను కూడా ఆశించవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / జియో సినిమా ను ఉచితంగా ఇచ్చిన సమయంలోనే మంచి కంటెంట్ ను అందించిన అంబానీ( Ambani ) వారు ఇప్పుడు డబ్బు వసూళ్లు చేస్తే ఏ స్థాయి లో మంచి కంటెంట్‌ ను అందిస్తారో అర్థం చేసుకోవచ్చు.

జియో సినిమా లో భారీ ఎత్తున సినిమా లను స్ట్రీమింగ్‌ చేసేందుకు ఒప్పందాలు జరుగుతున్నాయి.

పాత సినిమాలతో పాటు కొత్త సినిమాలను పెద్ద ఎత్తున జియో సినిమా వారు కొనుగోలు చేయడం జరుగుతోంది.

"""/" / తెలుగు లో ప్రస్తుతం ఆహా( Aha ) మరియు ఇతర ఓటీటీ లు భారీ మొత్తంలో డబ్బు వ్యచ్చించి కొత్త సినిమాలను కొనుగోలు చేస్తున్న విషయం తెల్సిందే.

ఇప్పుడు జియో తెలుగు సినిమా లపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జియో సినిమా తెలుగు డివిజన్‌ ను ఏర్పాటు చేసి రికార్డు స్థాయి లో ఖర్చు చేయడంతో పాటు పెద్ద ఎత్తున వెబ్‌ సిరీస్ లను కూడా అందించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

జియో సినిమా ఓటీటీ తెలుగు మార్కెట్‌ లో ఎంట్రీ ఇస్తే ఆహా ఇతర ఓటీటీ లు కనిపించకుండా పోయే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ట్రంప్‌కు ఫస్ట్ షాక్ .. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను నిలిపివేసిన కోర్ట్, భారతీయులకు ఊరట