జియో 5జీ ఫోన్ ఫీచర్లు మామూలుగా లేవుగా.. ఎప్పుడు లాంచ్ అవుతుందంటే..?

ప్రస్తుతం మార్కెట్లో జియో( Jio ) వినియోగదారులకు తక్కువ ధరలోనే రీఛార్జ్, డేటా ప్లాన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక గతంలో 4జీ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసి ఎంతో ఆదరణ పొందింది.

తాజాగా మార్కెట్ లోకి 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల( 5G Smartphone ) చేసేందుకు రెడీ అవుతోంది.

అయితే ఈ 5జీ స్మార్ట్ ఫోన్ గురించి చాలా రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లకు సంబంధించిన సమాచారం లీక్ అయ్యింది.

ఆ వివరాలు ఏమిటో చూద్దాం. """/" / ఈ సంవత్సరంలోనే ఈ 5జీ మొబైల్ ఫోన్ మార్కెట్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

లీకైన సమాచారం ప్రకారం ఈ స్మార్ట్ఫోన్ 6.5 అంగుళాల LCD డిస్ ప్లే తో అందుబాటులోకి రానుంది.

ఈ మొబైల్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంతో ఉంటుంది.ఈ ఫోన్ కెమెరా సెటప్ 13 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ తో 2 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా సెన్సార్ ఫోన్ కు వెనుక భాగంలో అందుబాటులో ఉంటుంది.

"""/" / Qualcomm Snapdragon 480 Plus SM4350 Pro ప్రాసెసింగ్ వేగం, మల్టీ టాస్కింగ్ తో రానుంది.

తే కాకుండా ఫోన్ ముందు భాగంలో 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా( Mega Pixel Selfie Camera ) సెన్సార్ అందుబాటులో ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ త్వరగా చార్జింగ్ కావడానికి 18w ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో 5000mAh బ్యాటరీ తో ఉంటుంది.

అంతేకాకుండా కనెక్టివిటీ కోసం, భద్రత కోసం యూఎస్బీ టైప్ సి పోర్ట్, Wifi 5, సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కు మద్దతు ఇస్తుంది.

త్వరలో ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి ఎప్పుడు అడుగుపెట్టనుందో అధికారికంగా కంపెనీ అన్ని వివరాలు ప్రకటించనుంది.