జానీ మాస్టర్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా ?

ఒకప్పుడు కొరియోగ్రాఫర్స్ అంటే బ్రతకడమే కష్టంగా ఉండేది.కానీ రోజులు పూర్తిగా మారిపోయాయి.

ప్రతిదీ డబ్బుతోనే కొలిచే పరిస్థితి కొనసాగుతుంది.ఒక్క సినిమాల్లో పని చేస్తేనే డబ్బులు వస్తాయి అనే రోజుల్లో లేము.

ఒక్కసారి గుర్తింపు వచ్చిందంటే చాలు రియాలిటీ షోలు, కామెడి షో లు ఫారెన్ ట్రిప్పులు అంటూ ఎటు చుసిన డబ్బు వర్షం కురుస్తుంది.

ప్రతి టీవీ ఛానెల్ ఒక డాన్స్ షో చేస్తుండటం తో అన్ని భాషల్లో డాన్స్ మాస్టర్స్ ఫుల్ బిజీ గా డబ్బులు కూడబెట్టే పనిలో ఉన్నారు.

ఇక సినిమాల్లో గుర్తింపు ఉంటె జడ్జిలుగా కూర్చొని బాగానే వెనకేస్తున్నారు.అలాంటి వారిలో జానీ మాస్టర్ కూడా ఒకరు.

కేవలం హీరో, హీరోయిన్లు, నిర్మాతలు, కామెడియన్ల్ మాత్రమే విలాసవంతంగా బ్రతుకుతున్న నేటి రోజుల్లో జానీ మాస్టర్ లాంటి కొరియోగ్రాఫేర్ కూడా బాగానే కూడబెట్టాడు అనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

"""/"/ టాలీవుడ్ లో శేఖర్ మాస్టర్ బాగా బిజీ కొరియోగ్రాఫేర్ ఆ తర్వాత అదే రేంజ్ లో జానీ మాస్టర్ కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

అంతే కాదు ఎలాంటి కష్టమైనా మూమెంట్స్ ని కూడా అలవోకగా చేయగలడు అనే పేరు ఉంది జానీ మాస్టర్ కి.

అందుకే ఎంతో పెద్ద పెద్ద స్టార్స్ నుంచి చిన్న హీరోల వరకు అందరు జానీ మాస్టర్ తమ సినిమాలో పని చేయాలనీ కోరుకుంటున్నారు.

ఇక ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ్, కన్నడ మరియు హిందీ భాషల్లోనూ జానీ మాస్టర్ పని చేస్తున్నాడు.

ఒకప్పుడు డీ లో డాన్స్ మాస్టర్ గా కెరీర్ కొనసాగించి ఆ తర్వాత ద్రోణ సినిమాతో తన సినిమా కెరీర్ కొనసాగించాడు.

"""/"/ రచ్చ సినిమా జానీ మాస్టర్ కి మంచి పేరు ని ఇచ్చింది.

అలాగే సల్మాన్ ఖాన్ జయహో సినిమాకు కూడా జానీ పని చేసాడు.అలాగే ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్ ద్వారా కూడా జానీ పాపులారిటీ మరింత పెరిగింది.

ఇక అల్లు అర్జున్ ఆలా వైకుంఠ పురం సినిమాలో బుట్ట బొమ్మ పాటతో తెలుగు ఇండస్ట్రీ లో తిరుగులేని చక్రం తిప్పుతున్నాడు జానీ.

కానీ తన భార్య కు డెలివరీ కి 5 లక్షల బిల్లు కట్టలేని స్థితిలో ఉంటె రామ్ చరణ్ మరియు ఉపాసన ఆ బిల్లు కట్టారని ఒక ఇంటర్వ్యూ లో జానీ తెలిపాడు.

కేవలం తన డాన్స్ పై ఉన్న అభిమానం తో ఆ బిల్లు తనకు తెలియకుండా కట్టారని చెప్పుకోచ్చాడు.

ప్రస్తుతం ఒక్కో సినిమాకు 20 నుంచి 30 లక్షల పారితోషకం తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు జానీ మాస్టర్.

సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల వివరాలివే.. వెంకీ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్లా?