విడ్డూరం : చీమల పచ్చడి తెగ తినేస్తున్నారు, ఎందుకో తెలుసా?

మనం తినే అన్నంలో రెండు మూడు చీమలు ఉన్నా, మనం తినే ఇతర ఏదైనా పదార్థంలో చీమలు కనిపించినా కూడా వెంటనే ఆ అన్నం లేదా పదార్థంను పక్కకు పెట్టేస్తారు.

కొందరైతే ఆ చీమలను తీసేసి తింటారు.చీమలను చూస్తేనే ఒకరకమైన వాంతులు ఫీలింగ్‌ కలుగుతుంది.

ఇంట్లో చీమలు ఉన్నాయంటే గమీషన్‌ లేదంటే మరేదైనా చీమల మందుతో వాటిని చంపేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

కాని అక్కడి వారు మాత్రం చీమలు కనిపిస్తే చాలు చటుక్కున మింగేస్తారు. """/"/  చీమలు తినే వారు ప్రపంచంలో ఎక్కడెక్కడో లేరు, మన దేశంలోనే ఝార్ఖండ్‌ రాష్ట్రంలో ఉన్నారు.

ఆ రాష్ట్రంలోని ఆదిమానవుల తెగ అయిన కోడా జాతి వారు చీమలను బోందీ తిన్నట్లుగా బుక్కేస్తున్నారు.

ఆరు తరాలుగా ఈ సాంప్రదాయం తమకు వస్తుందని, ఇందులో కొత్తేం అనిపించడం లేదని వారు అంటున్నారు.

ఎర్ర చీమలు ఎక్కడ కనిపించినా మేము వాటిని వదలకుండా తింటామంటూ వారు చెబుతున్నారు.

చీమల పుట్టల కోసం తాము వెదుకుతూ ఉంటామని చెబుతున్నారు. """/"/  చీమలు చాలా రకాలు ఉంటాయి.

వీరు తినేది పెద్ద ఎర్ర చీమలు.ఆ చీమలు తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు తొలగి పోతాయంటూ వారు నమ్ముతున్నారు.

వాటిని రెగ్యులర్‌గా తిన్న వారికి ఇప్పటి వరకు ఎలాంటి జబ్బులు కూడా రాలేదని ముసలి వారు అంటున్నారు.

తమ పూర్వీకులు తమకు ఇచ్చిన ఆస్తిగా దీన్ని మీము భావిస్తున్నాం.వారు పాటించినట్లుగానే మేము పాటిస్తున్నాం అంటూ స్థానికులు చెబుతున్నారు.

చీమలు తినడం వల్ల తమకు కలిగే ప్రయోజనాలను తమ పిల్లలకు కూడా చెబుతున్నామని వారు అంటున్నారు.

"""/"/  ఇక స్థానిక వైధ్యులు కూడా వారి చీమలు తినడం గురించి స్పందిస్తూ అవి వారికి ఆరోగ్యంను ఇస్తున్నాయి.

వాటిని తినడం వల్ల వారికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు.పైగా వారు పలు అనారోగ్య సమస్యల నుండి దూరం అవుతున్నారు.

అలాంటప్పుడు ఎందుకు మేము వాటిని తినకండి అని చెప్పాలంటున్నారు.చీమలను వారు పచ్చడి రూపంలో చేసుకుని తింటున్నారు.

బాగా ఉడకబెట్టి వాటిని ఇతర పదార్థాలతో కలిపి వండేస్తున్నారు.చీమలు దొరకగానే మొదట వాటిని బాగా రోలు లేదా బండలపై మిక్సీలా చేస్తారు.

ఆ తర్వాత దాన్ని ఉపయోగిస్తారు.చీమల కోసం వీరు పెద్ద పెద్ద చెట్టు ఎక్కి మరీ వేటాడుతారు.

ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను.. సోనమ్ కపూర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!