నా బట్టల గురించి మాట్లాడుకోవడం చాలా ఇబ్బందిగా ఉందంటోన్న హీరోయిన్...

బాలీవుడ్లో అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు.

అయితే ఈమె 2018వ సంవత్సరంలో ధఢక్ అనే చిత్రంతో బాలీవుడ్ సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయింది.

వచ్చీ రావడంతోనే పర్వాలేదనిపించిన జాన్వికపూర్ సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.

అంతేకాక వరుస చిత్రాల్లో నటించే అవకాశాలు కూడా దక్కించుకుంది.దీంతో ప్రస్తుతం జాన్వీ కపూర్ బిజీ బిజీగా గడుపుతోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం జాన్వీ కపూర్ గురించి ఓ వార్త నెట్ లో వైరల్ అవుతుంది.

అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే జాన్వీ కపూర్ ఫిట్నెస్ గా ఉండడం కోసం నిరంతరం జిమ్ చేస్తూ పలు వర్కౌట్లు కూడా చేస్తుంది.

అయితే ఆ సమయంలో జాన్వికపూర్ చిట్టి పొట్టి నిక్కర్లు ధరించి బయటికి రావడంతో కొందరు ఆమె ఫోటోలను తీసుకొని సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ చేస్తున్నారు.

అయితే ఈ విషయం గురించి తాజాగా జాన్వీ కపూర్ ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడింది.

"""/"/ ఇందులో భాగంగా ఒకప్పుడు తన నటన కంటే తాను ధరించినటువంటి దుస్తుల విషయం గురించి ఎక్కువగా చర్చించుకునే వారని, కానీ ఇప్పుడు తన నటన గురించి మాత్రమే చర్చించుకుంటున్నారని చెప్పుకొచ్చింది.

అంతేకాక గతంలో తన బట్టలు గురించి ట్రోల్స్ మరియు చర్చలు గురించి తెలిసి చాలా బాధపడేదాన్నిఅని కూడా తెలిపింది.

కానీ ఇప్పుడు చాల లైట్ గా తీసుకుంటున్నాని, ఎందుకంటే  బట్టల విషయంలో అవగాహన లేని కొందరు చేసేటువంటి కామెంట్లకి ఎందుకు బాధ పడాలని అంటోంది ఈ అమ్మడు.

అయితే ప్రస్తుతం జాన్వి కపూర్ "రూహి ఆఫ్జానా" అనే హర్రర్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తోంది.తాజాగా ఈ చిత్రానికి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.

అంతేగాక మరో చిత్రాల్లో కూడా జాన్వి కపూర్ నటిస్తోంది.ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రాల చిత్రీకరణను నిలిపి వేశారు.

వైరల్ వీడియో: పట్టపగలు నడిరోడ్డుపై స్కూల్ విద్యార్థిని కిడ్నాప్