లాక్ డౌన్ లో ఇంట్లో కష్టాలు తెలుసుకున్న జాన్వీ కపూర్

సెలబ్రిటీ పిల్లలకి, సెలబ్రిటీలకి ఇంట్లో కష్టాలు ఎలా ఉంటాయో తెలియదు.షూటింగ్ లు, పార్టీలు అంటూ తిరిగే వారికి ఇంట్లో టైం కుటుంబంతో గడిపే సమయం చాలా తక్కువ.

ఇక వేళ కుటుంబంతో స్పెండ్ చేసిన కూడా ఇంటి విషయాలు, పెద్దగా పట్టించుకోరు.

అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీలు అందరూ ఇంటికి పరిమితం అయిపోయారు.

దీంతో ఇంట్లో కష్టాలు ఎలా ఉంటాయి.ఇలాంటి పరిస్థితిలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుస్తున్నాయి.

ఈ విషయాన్న్ అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో పంచుకుంది.

లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉండటం చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను అని చెప్పింది.

తినే ఆహారం విలువ, ఇంట్లో వస్తువుల విలువ తెలిసింది.ఇంట్లో నిత్యావసర వస్తువులు అయిపోతే పేదోళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్ధమైంది.

కష్టం అంటే ఎలా ఉంటుందో తెలియకుండా పెరిగాను.ఇంత కాలం నేను ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నానో అర్ధమైంది.

ఇలాంటి సమయంలో ఇంట్లోకి ఏమేమీ అవసరం అవుతాయో తెలుసుకున్నా.ఇంట్లో కుటుంబ సభ్యులని పట్టించుకోవాలనే ధ్యాస వచ్చింది.

ముఖ్యంగా తన తండ్రి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అని చెప్పింది.ఇప్పటికి తన తల్లి లేదని అంటే నమ్మలేకపోతున్న తన రూమ్ లో ఆమె ఉందనే ఫీలింగ్ కలుగుతుంది.

టైం విలువ ఏంటో ఇప్పుడు నాకు తెలుస్తుంది.అంటూ జాన్వీ ఎమోషనల్ అయ్యి షేర్ చేసుకుంది.

విశాల్ సినిమాకు భారీ షాకిచ్చిన తెలుగు ప్రేక్షకులు.. అక్కడే తప్పు జరిగిందా?