ఆ హీరోయిన్లను పోటీగా చూస్తారా అన్న ప్రశ్నకు జాన్వీ కపూర్ అదిరిపోయే ఆన్సర్..

దేవర భామ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయింది.

ఆమె నర్తించిన "చుట్ట మల్లే చుట్టేశావే" పాట సూపర్ హిట్ అయింది.అందులో ఆ అమ్మడు దేవకన్య లాగా కనిపించడంతో అందరూ ఆమెను శ్రీదేవితో పోలుస్తున్నారు.

మళ్లీ ఆమెను వెండి తెరపై చూడాలని దేవర పార్ట్ 2( Devara 2 ) కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఈ బాలీవుడ్ నటి తన స్నేహితులు అనన్య పాండే,( Ananya Panday ) శనాయ కపూర్, ( Shanaya Kapoor ) సారా అలీ ఖాన్‌లతో( Sara Ali Khan ) ఉన్న స్నేహం గురించి చెప్పింది.

వారితో తనకున్న బంధం గురించి చాలా అభిమానంగా మాట్లాడింది.వారి విజయాల పట్ల తాను ఎంతో ఆనందంగా ఉంటానని జాన్వీ కపూర్ తెలిపింది.

సంజయ్ కపూర్, మహీప్ కపూర్ దంపతుల కూతురే శనాయ కపూర్. """/" / జాన్వీ కపూర్ మాట్లాడుతూ "అనన్య నా చిన్ననాటి స్నేహితురాలు.

ఆమె, శనాయ చాలా కాలంగా బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నారు.అనన్యతో స్నేహం పెంచుకున్నాక శనాయ కూడా నాకు ఫ్రెండ్ అయ్యింది.

మేము చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకునేవాళ్లం.సారాతో మాత్రం ఆమె నటిగా మారే ముందే స్నేహం కుదిరింది.

నాకు ఆమె దాదాపు ఆరు లేదా ఏడు సంవత్సరాలుగా తెలుసు.వారిద్దరిని చూసినప్పుడు, నేను వారిని కేవలం నటీమణులుగా చూడను.

వారు చిన్నపిల్లలుగా ఉండే రోజులను నేను గుర్తు చేసుకుంటాను.ఉదాహరణకు, సారా ఒకసారి లాస్ ఏంజిల్స్‌కు నన్ను చూడటానికి వచ్చింది.

అక్కడ డిస్నీ ల్యాండ్‌లో లైన్‌లో నిలబడకుండా నాకు సహాయం కూడా చేసింది.నేను వారిద్దరినీ నిజంగా ఇష్టపడుతున్నాను.

వారి కెరీర్‌లో వాళ్లు బాగా రాణించాలని కోరుకుంటున్నాను.వాళ్లు నాకోసం అలాగే ఆశిస్తారు.

" అని చెప్పుకొచ్చింది. """/" / జాన్వీ కపూర్ ఇంకా మాట్లాడుతూ "సినిమా ఇండస్ట్రీలో అందరూ సక్సెస్ అయ్యేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి.

మేము అందరం చాలా సెక్యూర్‌గా ఉన్నాం.అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు అని మాకు తెలుసు.

అన్ని అవకాశాలు ఒకే నటికి దక్కాలని లేదు.మూవీ ఇండస్ట్రీలో అలా జరగదు కూడా.

" అని స్పష్టం చేసింది.జాన్వీ ఇచ్చిన ఈ సమాధానం చాలామందికి నచ్చింది.

ఈ నలుగురు ఫ్రెండ్స్ కలిసి కనిపిస్తే తమకు కనులవిందే అని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేశారు.

పుష్ప ది రూల్ ఫస్ట్ డే టార్గెట్ అన్ని రూ.కోట్లా.. ఆ తప్పు మాత్రం మైనస్ కానుందా?