ప్రేయసి కోసం సముద్రాన్ని దాటాడు… చివరికి?

ప్రేమ కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు ప్రేమికులు.చివరికి ప్రాణాలు కూడా లెక్కచేయకుండా తమ ప్రేమ కోసం అంతులేని ప్రయత్నాలు చేస్తుంటారు.

ఇలాంటివన్నీ సినిమాలోని చూస్తుంటాం.అంతేగాని నిజ జీవితంలో ఇలా జరుగుతుందని ఎవరు ఊహించుకోరు.

ఇదిలా ఉంటే తన ప్రేయసి కోసం ఏకంగా ఒంటరిగా సముద్రంలో పడప ప్రయాణం చేసి చివరకు జైలు లో కూర్చున్న సంగతి అందరినీ ఆశ్చర్యపరిచింది.

స్కాట్లాండ్ కు చెందిన 28 ఏళ్ల యువకుడు డేల్ మెక్ లాగిన్.ఐరిష్ సముద్రం లోని ఐల్ ఆఫ్ మన్ దీవిలో ఉన్న రామ్సే లో నివాసముంటున్న అమ్మాయి H3 Class=subheader-styleజెస్సికా రెడ్ క్లిప్స్ /h3p తో ప్రేమలో పడ్డాడు.

దీంతో ఆమె కోసం వెళ్లగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.డేల్ తన వృత్తికి సంబంధించిన కాంట్రాక్టు కోసం రామ్సే లో కొన్ని రోజులు నివసించగా.

అక్కడున్న జెస్సికా ను చూసి ప్రేమలో పడ్డాడు.దీంతో అలా సాగుతున్న క్రమంలో తన వృత్తికి సంబంధించిన పని పూర్తవడంతో తిరిగి తన సొంత గూటికి చేరు కున్నాడు.

"""/"/ కాగా ప్రేమించిన అమ్మాయిని విడిచి ఉండలేక సముద్రాన్ని దాటడం కోసం అధికారులను కోరగా వాళ్లు దానికి తిరస్కరించడంతో.

తానే స్వయంగా ఓ జెట్ స్కై ( బోటు) కొనుక్కొని మరీ ప్రేయసి కోసం తన ప్రయాణాన్ని సాగించాడు.

దీంతో ఎన్నో ఎదురు అడ్డంకులు దాటుకొని దాదాపు నాలుగు గంటలకు పైగా 25 మైళ్ళ దూరాన్ని ప్రయాణించాడు.

కాగా అక్కడి నుండి మరో పదిహేను మైళ్ళు దూరాన్ని కాలి బాటలో నడిచాడు.

చివరికి మొత్తానికి ప్రేమించిన అమ్మాయి వద్దకు చేరుకొని జరిగిన విషయం తెలియజేశాడు.దీంతో వీళ్ళిద్దరూ కలుసుకున్న తరుణంలో బయటకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోగా తర్వాత రోజు నైట్ క్లబ్ కు వెళ్లారు.

కాగా వీరిద్దరిని పోలీసులు ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.ఎంత చెప్పినా వినకుండా పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని అంతర్జాతీయంగా నడుస్తున్నా కోవిడ్ నిబంధనలను పాటించకుండా రిస్క్ చేసి నందుకు న్యాయస్థానం ముందు నిలబెట్టారు.

దీంతో డేల్ కు నాలుగు వారాల పాటు జైలు శిక్ష విధించగా సోషల్ మీడియాలో డేల్ ప్రేమ గురించి సాహస వీరుడు అని.

మరిన్ని ప్రేమకు సంబంధించిన కామెంట్లను పోస్ట్ చేస్తున్నారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టంపై సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ..!!