అమెరికన్ ఫైనాన్షియర్, సెక్స్ కుంభకోణం కేసులో నేరస్థుడు అయినటువంటి జెఫ్రీ ఎప్‌స్టీన్,( Jeffrey Epstein ) అమెరికా కుబేరుడు బిల్‌గేట్స్( Bill Gates ) మధ్య కాస్త స్నేహ బంధం వుంది.
కాగా మరోసారి వారి గురించి వార్తలు వెల్లువెత్తాయి.విషయం ఏమంటే, ఓ రష్యన్ క్రీడాకారిణితో ఉన్న అఫైర్ విషయంలో గేట్స్‌ను జేఫ్రీ బ్లాక్‌మెయిల్ చేయడానికి చూశాడని ఓ అంతర్జాతీయ వార్త కథనం.
దాని ప్రకారం, 2010లో గేట్స్.రష్యా బ్రిడ్జ్ ప్లేయర్ మిలా అంటోనోవాను( Mila Antonova ) కలుసుకున్నారు.
అప్పుడు ఆమె 25 ఏళ్ల పడుచు పిల్ల.అప్పటి వీడియో ఒకటి ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టడం మనం చూడవచ్చు.
"""/" /
అందులో గేట్స్ - మిలా అంటోనోవా దేనిగురించో చాలా డీప్ గా ప్రస్తావించినట్లు కనిపిస్తోంది.
ఈ ఇద్దరి మధ్య బంధాన్ని గుర్తించిన ఎప్‌స్టీన్.దాన్నుంచి లబ్ధి పొందాలని ఓ ప్లాన్ వేసుకున్నాడు.
2017లో గేట్స్‌కు ఒక ఈ-మెయిల్ పంపి బ్లాక్ మెయిల్ చేయాలని ట్రై చేసాడు.
మిలా కోడింగ్ కోర్సు కోసం తాను డబ్బు చెల్లించానని, దానిని తిరిగి ఇవ్వాలని అందులో గేట్స్‌ను డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.
ఒకవేళ దానిని ఇవ్వకపోతే.వారి బంధం గురించి బయటపెడతానని అతగాడు బెదిరించినట్లు ఓ కధనం.
"""/" /
ఇకపోతే గేట్స్, ఎప్‌స్టీన్ మధ్య 2011 నుంచి చిన్నపాటి పరిచయం వుంది.
అప్పటికే ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణంలో దోషిగా తేలడంతో గేట్స్ మాజీ భార్య మెలిందా గేట్స్ ఆ స్నేహానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చూసింది.
ఈ విషయాన్ని ఆమె 2022లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ప్రస్తావించారు కూడా.గేట్స్ కూడా అతనితో అవసరం మేరకు మాత్రమే మాట్లాడేవారని ఆమె చెప్పుకొచ్చేది.
సేవా కార్యక్రమాల నిమిత్తం వారిద్దరూ తరచూ కలుసుకునేవారని, తర్వాత గేట్స్ గత బంధం గురించి తెలిసిన ఎప్‌స్టీన్.
వాటి నుంచి లబ్ధి పొందేందుకు ప్రయత్నించారని గేట్స్ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.
ఒకే సమయంలో ఎక్కువ సినిమాలు.. ప్రభాస్ కు మాత్రమే ఎలా సాధ్యమవుతుంది?