అంతరిక్షంలో విస్తరించేందుకు బెజోస్ వ్యూహం.. స్పేస్‌లో ‘‘బిజినెస్ పార్క్’’ ఏర్పాటుకు సన్నాహాలు

గత కొన్ని రోజులుగా అంతరిక్ష యాత్రలపై అన్ని దేశాల మీడియాలతో పాటు సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైన కథనాలు వెలువడుతున్న సంగత తెలిసిందే.

‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ సంస్థ అధినేత – బ్రిటీషర్‌ రిచర్డ్‌ బ్రాన్సన్‌ జూలై 11న, అది జరిగిన సరిగ్గా తొమ్మిది రోజులకు జూలై 20న ఆ సంస్థకు బలమైన ప్రత్యర్థి ‘బ్లూ ఆరిజన్‌’ అధినేత– అమెరికన్‌ వ్యాపారి జెఫ్‌ బెజోస్‌ తమ బృందాలతో రోదసీ విహారం చేసి వచ్చారు.

వీటి గురించి ఇవాళ ప్రపంచమంతా గొప్పగా చెప్పుకుంటోంది.తర్వాత ‘టెస్లా’ సంస్థ అధినేత ఎలన్‌ మస్క్‌ తన ‘స్పేస్‌ ఎక్స్‌’ని కూడా అంతరిక్షంలో పంపారు.

అయితే తాను స్పేస్‌లో ఎక్కడో వెనుకబడ్డానని భావిస్తున్న అమెజాన్ అధినేత కొత్త వ్యూహాలు రచిస్తున్నారు.

దీనిలో భాగంగా సోమవారం బోయింగ్‌తో కలిసి ‘‘ఆర్బిటల్ రీఫ్’’ అనే వాణిజ్య అంతరిక్ష కేంద్రాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికలను ఆయన ఆవిష్కరించారు.

ఈ దశాబ్ధం రెండవ భాగంలో అంతరిక్ష నౌకను ప్రయోగించాలని జెఫ్ బెజోస్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

డిఫెన్స్ కాంట్రాక్టర్ సియెర్రా నెవాడా కార్ప్‌కి చెందిన స్పేస్ ఫ్లైట్ వింగ్ సియెర్రా స్పేస్ భాగస్వామ్యంతో ఈ వెంచర్ నిర్మించబడుతుంది.

రెడ్‌వైర్ స్పేస్, జెనెసిస్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్, ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలు కూడా ఈ ప్రాజెక్ట్‌కు మద్ధతును ఇవ్వనున్నాయి.

ఆర్బిటల్ రీఫ్ ‘‘మిక్స్‌డ్ యూజ్ బిజినెస్ పార్క్’’గా నిర్వహించబడుతుందని బ్లూ ఆరిజిన్, సియెర్రా స్పేస్‌లు సంయుక్త ప్రకటనలో తెలిపారు.

తద్వారా అంతరిక్షంలో కొత్త మార్కెట్లను తెరవడానికి , మౌలిక సదుపాయాలను అందించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఈ రెండు సంస్థలు తెలిపాయి.

సీజనల్ స్సేస్ ఏజెన్సీలు, హైటెక్ కన్సార్టియా, అంతరిక్ష కార్యక్రమాలు లేని దేశాలు, మీడియా, ట్రావెల్ కంపెనీలు, నిధులు సమకూర్చిన వారు, పెట్టుబడిదారులకు ఆర్బిటల్ రిఫ్‌లో స్థానం వుంటుందని ఈ రెండు కంపెనీలు వెల్లడించాయి.

ఈ ఏడాది ఏప్రిల్‌లో సియెర్రా మొట్టమొదటి ఎగిరే వాణిజ్య అంతరిక్ష కేంద్రాన్ని అందించే ప్రణాళికలను ప్రకటించిన సంగతి తెలిసిందే.

"""/"/ కాగా.తొలుత బెజోస్ అంతరిక్ష యాత్ర గురించి ప్రకటించగా.

ఆయన కంటే ముందే రోదసిలోకి వెళ్లిన ఘనతను దక్కించుకున్నారు వర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్.

అయితే వర్జిన్ కంటే ఎత్తుకు వెళ్లి ప్రత్యేకత చాటుకున్నారు బెజోస్.వర్జిన్ గెలాక్టిక్ కంటే మెట్టు పైన ఉండేలా ‘న్యూ షెపర్డ్‌’ యాత్ర సాగింది.

బ్రాన్సన్‌ సంస్థకు చెందిన యూనిటీ-22 వ్యోమనౌక.నేల నుంచి 88 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న సంగతి తెలిసిందే.

బెజోస్‌ వ్యోమనౌక మాత్రం 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది.భూవాతావరణం దాటాక అంతరిక్షం ఎక్కడ మొదలవుతుందన్నదానిపై నిర్దిష్ట నిర్వచనమేమీ లేదు.

అమెరికా ప్రమాణాల ప్రకారం చూస్తే 80 కిలోమీటర్ల ఎత్తులో అది మొదలవుతుంది.దీన్ని ప్రామాణికంగా చేసుకొని బ్రాన్సన్‌ 88 కిలోమీటర్ల ఎత్తులోకి వెళ్లొచ్చారు.

అయితే ఫెడరేషన్‌ ఏరోనాటిక్‌ ఇంటర్నేషనల్‌ (ఎఫ్‌ఏఐ) మాత్రం 100 కిలోమీటర్ల ఎత్తు తర్వాత అంతరిక్షం మొదలవుతుందని నిర్వచించింది.

దీంతో బెజోస్ 106 కిలోమీటర్లు అంతరిక్ష యాత్ర చేశారు.

టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత…..