'మ'కి జీవిత, రాజశేఖర్ రాజీనామా!
TeluguStop.com
ఇండస్ట్రీలో అందరికి ఒక దారి అయితే జీవిత, రాజశేఖర్ దంపతులది ఒక దారి.
మిగిలిన అందరిది ఒక దారి.ఇండస్ట్రీలో ఎక్కువగా వివాదాలకి కేంద్ర బిందువుగా ఉన్న వీళ్ళు తాజాగా జరిగిన మా అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే.
రాజశేఖర్ స్టేజ్ మీద చేసిన న్యూసెన్స్ పై చిరంజీవి, మోహన్ బాబు సీరియస్ అయ్యారు.
తరువాత దీనిపై జీవిత క్షమాపణలు చెప్పింది.అయితే ఈ ఇష్యూ తర్వాత వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలనే విధంగా మా పెద్దలు మాట్లాడారు.
ఇదిలా ఉంటే మా సభ్యుత్వానికి జీవిత, రాజశేఖర్ రాజీనామా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సమావేశంలో తమకి జరిగిన అవమానం నేపధ్యంలో కూతుళ్ళతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.
వాళ్ళ రాజీనామాని ప్రకటించకపోయిన దానిపై ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్న వాళ్ళు మీడియా ముందుకి వచ్చి తమ రాజీనామా విషయాన్ని స్పష్టం చేసే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.
మొత్తానికి మా అసోసియేషన్ గొడవలతో మరోసారి మీడియాలో ఈ రోజు హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి.
సమంతను హీరోయిన్ గా తీసుకోవద్దు.. ఆ హీరోకి వార్నింగ్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్స్?