పాపం.. జీవిత రాజశేఖర్ కష్టం గురించి వింటే కన్నీళ్లు ఆగవు?
TeluguStop.com
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్ లుగా రాణించి ఆ తర్వాత ఎన్నో రోజుల పాటు ప్రేమలో కొనసాగి పెళ్లితో ఒక్కటైనా జంటలు ఎన్నో ఉన్నాయి.
ఇలా పెళ్ళితో ఒకటై టాలీవుడ్ ప్రేక్షకులు అందరికి కూడా ఎవర్గ్రీన్ కపుల్ గా మారిపోయిన వారు చాలా మంది ఉన్నారు.
ఇలాంటి వారిలో ముందుగా గుర్తొచ్చేది రాజశేఖర్, జీవిత.ఒకప్పుడు జీవిత ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు.
రాజశేఖర్ అయితే కొన్ని దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరున్న హీరో గా కొనసాగుతున్నారు.
ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆహుతి,తలంబ్రాలు వంటి సినిమాలు సూపర్ హిట్ సాధించాయి.
ఈ సినిమాల సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది.
ఇక వీరిద్దరూ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ కఫుల్ గా ఉన్నారు.
ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమ అభిమానాన్ని చూపించుకుంటూ ఉంటారు.ఇక వీరి ప్రేమకు ప్రతిరూపంగా శివానీ ,శివాత్మిక అనే ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు.
ఇకపోతే ఇటీవలే జీవిత రాజశేఖర్ దంపతులు ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి వచ్చారు.
ఈ సందర్భంగా తన కేరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు జీవిత రాజశేఖర్ దంపతులు.
వీరిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు ఎలా పరిచయం ఏర్పడింది పరిచయం ప్రేమ పెళ్లి వరకు ఎలా వెళ్ళింది అని వారి మాటల్లోనే చెప్పించారు వ్యాఖ్యాత అలీ.
"""/" /
ఈ క్రమంలోనే ప్రస్తుతం జీవిత దర్శకత్వం లో రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న శేఖర్ సినిమా గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
ఈ సినిమా ప్రారంభించాలి అనుకున్న సమయంలో రాజశేఖర్ కి కోవిడ్ సోకి మానసిక సంఘర్షణలకు తమ కుటుంబం గురైంది అంటూ చెప్పుకొచ్చారు రాజశేఖర్.
అయన నెలరోజులపాటు ఐసీయూలో ఉండటాన్ని గుర్తు చేసుకుంటూనే ఇప్పటికి ఏడుపు వస్తుందని ఎమోషనల్ అయ్యింది జీవిత.
ఆ సమయంలో మరో రెండు రోజుల్లో చనిపోతాను బాడిని తీసుకెళ్లి కాలుస్తారు అన్న ఆలోచనతో ఉన్నానని రాజశేఖర్ ఎమోషనల్ అయ్యారు.
రూ.10 కోసం ఐఏఎస్ అధికారిని కొట్టిన బస్సు కండక్టర్.. వీడియో వైరల్!