సీఎం పాత్ర పోషించినంత మాత్రాన పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు కాదు.. జీవా సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఈ నెల 8వ తేదీన యాత్ర 2 సినిమా( Yatra 2 ) విడుదల కానున్న సంగతి తెలిసిందే.

వైఎస్ జగన్ బయోపిక్ గా( YS Jagan Biopic ) తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

అయితే జీవా( Jeeva ) యాత్ర2 ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మమ్ముట్టి తనతో చెప్పిన విషయాలను జీవా వెల్లడించారు.2001 సంవత్సరంలో ఆనందం సినిమా కోసం మమ్ముట్టిని కలిశానని జీవా తెలిపారు.

దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత యాత్ర2 సినిమా సెట్స్ లో మమ్ముట్టిని కలిశానని జీవా కామెంట్లు చేశారు.

మమ్ముట్టి( Mammootty ) చాలా సరదా మనిషని జీవా చెప్పుకొచ్చారు.నేను మమ్ముట్టి గారిని అడిగానని యాత్రలో వైఎస్సార్ పాత్రలో ( YSR Role )నటించి ఎలాంటి సమస్యను ఎదుర్కోలేదా అని అడిగానని జీవా కామెంట్లు చేశారు.

ఆ సమయంలో మమ్ముట్టి ఏ సమస్య ఏం సమస్యని మనం కేవలం నటులం మాత్రమేనని చెప్పారని జీవా పేర్కొన్నారు.

"""/" / వచ్చిన పాత్రలను చేసుకుంటూ వెళ్లాలని ఆయన చెప్పుకొచ్చారని జీవా పేర్కొన్నారు.

మమ్ముట్టి నాతో ఒక వ్యక్తి పాత్ర పోషించినంత మాత్రాన ఆయనకో, ఆయన పార్టీకో మద్దతు తెలిపినట్టు కాదని చెప్పారని జీవా కామెంట్లు చేశారు.

మమ్ముట్టి చెప్పిన మాటలను ఎప్పటికీ మరిచిపోలేనని జీవా అభిప్రాయం వ్యక్తం చేశారు.మమ్ముట్టి అభిప్రాయమే తన అభిప్రాయం అని జీవా పేర్కొన్నారు.

"""/" / యాత్ర2 సినిమా రికార్డ్ స్థాయిలో థియేటర్లలో రిలీజ్ అవుతుండగా యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ సినిమాతో మరో సక్సెస్ ను అందుకుంటామని నమ్ముతున్నారు.

యాత్ర2 సినిమా కోసం వైసీపీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే విడుదలైన యాత్ర2 అప్ డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

యాత్ర2 మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా బిజినెస్ వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ సినిమాకు పోటీగా ఈగల్, లాల్ సలామ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి.

అక్కడ బాహుబలి మూవీ రికార్డును బ్రేక్ చేసిన మహారాజ మూవీ.. ఏం జరిగిందంటే?