ఇండియా కూటమికి జేడీయూ చీఫ్ నితీశ్ షాక్..!

బీహార్ రాజకీయాల్లో మరో ట్విస్ట్ నెలకొంది.ఇండియా కూటమిలో( India Alliance ) భాగంగా ఉన్న సీఎం నితీశ్ కుమార్( CM Nitish Kumar ) ఆర్జేడీ, కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీకి( BJP ) మద్ధతు తెలపనున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసి బీజేపీ మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నితీశ్ కుమార్ యోచనలో ఉన్నారని సమాచారం.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇండియా కూటమికి ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు.

"""/" / ఇండియా కూటమి కన్వీనర్ పోస్టు ఇవ్వకపోవడంతో పాటు కాంగ్రెస్ సీట్ల సర్దుబాటులో జాప్యం జరగడంతో నితీశ్ కుమార్ అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.

మరోవైపు నితీశ్ నిర్ణయంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్( Akhilesh Yadav ) స్పందించారు.

నితీశ్ కు ప్రధాని అభ్యర్థిగా అవకాశం ఇవ్వాల్సిందన్నారు.ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే నితీశ్ పీఎం అయ్యేవారేమోనని అభిప్రాయం వ్యక్తం చేశారు.

మందులతో పని లేకుండా రక్తహీనత దూరం కావాలంటే ఇలా చేయండి!!