'సైకిల్ ' ఎక్కనున్న జేడి ?

సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఐపీఎస్ అధికారి వివి లక్ష్మీనారాయణ ఆ తరువాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

తాను సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన సమయంలో జగన్ అక్రమాస్తుల కేసును దర్యాప్తు చేశారు.

ఆ సమయంలోనే ఆయనకు ఆ స్థాయిలో గుర్తింపు వచ్చింది.ఆయన పనిచేసిన జెడి హోదా ఆయన ఇంటిపేరుగా మారిపోయింది.

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేసిన లక్ష్మీనారాయణ స్వల్ప తేడాతో ఓటమి చెందారు.

ఇక అప్పటి నుంచి విశాఖ లోనే ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు కొంతకాలం పాటు జనసేన లో యాక్టివ్ గానే ఉన్నా.

ఆ పార్టీకి రాజీనామా చేసి ప్రస్తుతం అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.అయితే ఆయన మళ్లీ జనసేన పార్టీలో చేరతారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది.

ఇక బీజేపీ సైతం లక్ష్మీనారాయణను చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేసింది.కానీ లక్ష్మీనారాయణ మాత్రం ఏ పార్టీలోనూ చేరకుండా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు.

ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని గట్టి ప్రచారం జరిగినా.

తన మనసులో మాట ఏమిటనేది లక్ష్మీనారాయణ బయట పెట్టలేదు.అయితే మళ్ళీ రాబోయే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్న లక్ష్మీనారాయణ ఈసారి బలమైన రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసి తన కల నెరవేర్చుకోవాలని చూస్తున్నారు.

"""/" / ఈ క్రమంలోనే ఆయన జనసేన బీజేపీ పార్టీలో చేరే కంటే బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు గా ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో టిడిపిలో చేరితేనే తన రాజకీయ భవిష్యత్ కు ఎటువంటి డోకా ఉండదని లక్ష్మీనారాయణ భావిస్తున్నారట.

ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయని.త్వరలోనే ఆయన సైకిల్ ఎక్కుతారు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్