సినిమా టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వ అనుమతులపై ఫైర్ అయిన జేడీ లక్ష్మీనారాయణ..!!
TeluguStop.com
సంక్రాంతి పండుగ నేపథ్యంలో భారీగా తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ సంక్రాంతి పండుగకు నాలుగు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి.మహేష్ బాబు "గుంటూరు కారం"( Guntur Kaaram ), నాగార్జున "నా సామిరంగ", వెంకటేష్ "సైంధవ", తేజా సజ్జా "హనుమాన్" సినిమాలు థియేటర్ లో విడుదల కాబోతున్నాయి.
వీటిలో కొన్నిటికి టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించడంతోపాటు కొన్ని స్పెషల్ షోలకు కూడా ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం జరిగింది.
"గుంటూరు కారం" సినిమాకి 50 రూపాయల పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వగా 100 రూపాయలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇస్తూ జీవో జారీ చేయడం జరిగింది.
అంతేకాదు ఈ సినిమా జనవరి 12 విడుదల తేదీ ప్రకటించగా.అర్ధరాత్రి నుండే షోస్ వేసుకోవడానికి కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది.
ఈ పరిణామంపై జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకులు జేడీ లక్ష్మీనారాయణ( JD Lakshmi Narayana ) స్పందించారు.
సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల టికెట్ల ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వటంపై విమర్శించారు.
సినిమా టికెట్లు ధరలు( Movie Ticket Prices ) పెంచుకోవడానికి అనుమతులు ఇస్తున్నారు కానీ అన్నం పెట్టే రైతు పండించిన పంట ధర విషయంలో దగా చేస్తున్నారు అని ట్విట్టర్ లో సంచలన కామెంట్ పెట్టారు.
ఈ సంక్రాంతి పండుగకు విడుదల కాబోతున్న సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రా ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది.
చిరు నాగ్ వెంకీలలో బాలయ్యకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా?