మాజీ జేడీ పార్టీ లేనట్టే ... జనసేనలో ఎంట్రీ ఉన్నట్టే ..?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ రాజకీయ ప్రస్థానం కు సంబంధించి ప్రజల్లో ఇంకా సస్పెన్స్ వీడడంలేదు.

ఆయన జనసేన.టీడీపీ.

లోక్ సత్తా.బీజేపీ పార్టీల్లో చేరబోతున్నారు అంటూ.

పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.ఈ పార్టీల్లో ఏదో ఒక పార్టీలో ఆయన చేరడం ఖాయం అని ఆయనకు మరో ఆప్షన్ లేదు అని అంతా భావించారు.

అయితే ఆయన అకస్మాత్తుగా పార్టీ పెట్టబోతున్నట్టు .లోక్ సత్తాలో చేరడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.

ఆ తరువాత ఏమైందో ఏమో కానీ ఆయన బాగా సైలెంట్ అయిపోయారు.దీంతో మళ్ళీ అందరిలోనూ సస్పెన్స్ కొనసాగింది.

అసలు ఆయన రాజకీయాల్లోకి వస్తాడా లేక వెనకడుగు వేస్తాడా అని అనుకుంటున్న సమయంలో మళ్ళీ మరో వార్త బయటకి వచ్చింది.

తాజాగా వస్తున్న వార్తల ప్రకారం లక్ష్మీనారాయణ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన పార్టీలో చేరబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని.జనసేనలో లక్ష్మీనారాయణకు సముచిత స్థానం ఇవ్వడానికి పవన్ ఒకే చెప్పినట్టు సమాచారం.

అసలు సొంతంగా పార్టీ పెట్టడం వల్ల ఆయనకు ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పి పవన్ కళ్యాణ్ ఆయనను ఒప్పించారట.

మీ ఆశయాలు నా ఆశయాలు చాలా దగ్గరగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ చెప్పారట.

నిజాయితీగల వ్యక్తిగా లక్ష్మి నారాయణకు క్లిన్ ఇమేజ్ ఉండడంతో అది జనసేనకు కూడా బాగా కలిసి వస్తుందని పవన్ కూడా భావిస్తున్నాడట.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఇప్పటికే లక్ష్మి నారాయణ ఏపీలో అనేక ప్రాంతాల్లో పర్యటనలు పూర్తి చేశారు.

ఈ సందర్భంగా అనేకమంది మేధావులు, విద్యార్థులు, రైతులు ఇలా అనేక వర్గాల ప్రజలను కలుసుకున్నారు.

తనకంటూ ఒక గుర్తింపు.గౌరవం సంపాదించుకున్నారు.

అప్పట్లో ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసు, గాలి జనార్దన్‌రెడ్డి మైనింగ్‌ కేసుల వ్యవహారంతో పాటు సత్యం కంప్యూటర్స్ కేసు అప్పటి సీబీఐ జెడి లక్ష్మీనారాయణ అత్యంత కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

అసలు ఉద్యోగానికి రాజీనామా చేసిన వెంటనే ఆయన జనసేనలో చేరబోతున్నాడు అంటూ మొదట్లోనే ప్రచారం జరిగింది.

అయితే ఈ విషయంపై అటు జనసేన కానీ లక్ష్మీనారాయణ కానీ స్పందించలేదు.ప్రస్తుతం పవన్ తో జరిగిన చర్చల నేపథ్యంలో త్వరలోనే ఆయన జనసేనలో చేరే అవకాశం కనిపిస్తోంది.

డబ్బుల ఆశ చూపి ఓటు వేయించుకోవాలని చూస్తోంది.. కాంగ్రెస్ పై ఈటల ఫైర్