మాజీ జేడీ స్ట్రోకులు .... బాబు ఇమేజ్ కి బ్రేకులు !

ఏపీలో జెంటిల్మెన్ ఇమేజ్ సాధించుకున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కు జనాల్లో ఒకరకమైన సానుకూల దృక్పధం ఉంది.

ఆయనపై ఇప్పటివరకు ఎటువంటి మచ్చలు లేకపోవడం.రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టి ప్రజానుకూల నిర్ణయాలు ప్రకటిస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు.

దీంతో లక్ష్మీనారాయణ చెప్పే విషయాలు కూడా ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్నాయి.ఇక ఈయన రాకతో ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు కూడా చోటు చేసుకున్నాయి.

ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారు.కాదు కాదు లోక్ సత్తా పార్టీలో చేరబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది.

అయితే.చివరికి ఆయన మాత్రం సొంత పార్టీ పెడుతున్నాను అంటూ క్లారిటీ కూడా ఇచ్చేసాడు.

ప్రస్తుతం జేడీ చేస్తున్న విమర్శలు టీడీపీ అధినేత చంద్రబాబు ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ జగన్‌మోహనరెడ్డిపై కత్తి దాడి ఘటనపై తొలిసారి స్పందించిన లక్ష్మీనారాయణ, చంద్రబాబు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ విషయంలో ప్రతిపక్షానికి అనుకూలంగా అధికారపక్షానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

జగన్ పై జరిగిన దాడి వ్యవహారం పై టీడీపీ ప్రభుత్వ వైఫల్యమేనని.దానికి పూర్తి బాధ్యత వహించాలని లక్ష్మి నారాయణ వ్యాఖ్యానించారు.

అంతేకాదు ప్రభుత్వ అసమర్ధత నిర్లక్ష్యం కారణంగా.పుష్కరాల సమయంలో 30 మంది చనిపోయారని.

నవ నిర్మాణ ధర్మ దీక్షల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయటం వంటివి అత్యంత ప్రమాదకర నేరాలని భావిస్తూ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలవరం పుట్టిస్తున్నాయి.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ప్రస్తుతం లక్ష్మీ నారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ కు మద్దతుగాను, చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ ఉండడంతో.

ఈ మాజీ జేడీకి టీడీపీ అంటే పీకల్లోతు కోపం ఎందుకో అని తెలుగు తమ్ముళ్లు విమర్శిస్తున్నారు.

అంతే కాదు ఈ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ఇప్పుడు హాట్-టాపిక్‌గా మారాయి.ఎందుకంటే అప్పట్లో సీబీఐ జేడీగా జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసులను విచారించి జగన్ ను జైలుకు వెళ్లాలా చేసాడు.

ఈ కేసుల విచారణ సమయంలోనే లక్ష్మీ నారాయణ చిత్తశుద్ధి .నిజాయితీ అందరి ప్రశంసలు అందుకోవడానికి కారణం అయ్యింది.

కానీ ఇప్పుడు ఆయన జగన్ కు మద్దతుగా టీడీపీ కి వ్యతిరేకంగా మాట్లాడ్డం టీడీపీ నాయకులకు నచ్చడంలేదు.

అమెరికాలో హైదరాబాద్ యువకుడు దారుణ హత్య..