JD Chakravarthy : నా తప్పు లేకపోయిన నాగార్జున నన్ను తిట్టారు.. జేడీ చక్రవర్తి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు జేడీ చక్రవర్తి( JD Chakravarthy )ఒకరు.

ఈయన నాగార్జున( Nagarjuna ) హీరోగా నటించిన శివ సినిమాలో( Shiva Movie ) విలన్ పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

  అనంతరం హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటుడుగా గుర్తింపు పొందినటువంటి చక్రవర్తి ఇటీవల కాలంలో సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు.

ఇలా కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈయన తిరిగి వెబ్ సిరీస్ లు సినిమాల ద్వారా బిజీ అవుతున్నారు.

"""/" / ఇటీవల దయ ( Daya ) అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అభిమానులను సందడి చేసారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి చక్రవర్తి తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ముఖ్యంగా తనకు నాగార్జున గారితో గొడవ జరిగిందని నా తప్పు లేకపోయినా ఆయన నన్ను తిట్టారు అంటూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు.

శివ సినిమా షూటింగ్ సమయంలోనే గొడవ జరిగిందని తెలిపారు. """/" / పటాన్ చెరులోని ఓ కేఫ్ లో షూటింగ్ జరుగుతుండగా చక్రవర్తి హోటల్ లోపలికి వెళ్తున్నాడంట, అదే సమయంలో నాగార్జున బయటికి వస్తుండగా తన భుజం తాకిందంట.

ఇలా అనుకోకుండా జరిగినటువంటి ఈ తప్పిదంతో నాగార్జున తనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

నాకు శివ సినిమాలో అవకాశం రావడమే గొప్ప అలాంటిది నేను ఒక  సారి చెప్పి ఉంటే ఈ గొడవ సర్దుమనిగేది కానీ అలా చేయకపోవడంతో నాగార్జున నాపై చాలా కోపడ్డారంటూ అప్పటి విషయాలను చక్రవర్తి గుర్తుచేసుకొని ఈ సందర్భంగా చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.