లేటు వయసులో పెళ్లి.. అప్పుడే విడాకులా?
TeluguStop.com
ఇప్పటికే మనం చాలా సార్లు చెప్పుకున్నాం.సినిమా పరిశ్రమ అనేది చాలా చిత్ర విచిత్రమైన పనులు చేస్తుందని.
బయటకు రంగు రంగుల సీతాకోక చిలుకలా కనిపించే ఇండస్ట్రీ వెనుక కనిపించని ఎన్నో చీకటి కోణాలు ఉంటాయి.
ఇక సినిమా తారలకు సంబంధించిన వివాహ బంధాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.
వారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో? ఎన్ని రోజులు కలిసి ఉంటారో? ఎప్పుడు విడిపోతారో? చెప్పడం ఆ బ్రహ్మదేవుడి తరం కూడా కాదు.
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో విడాకులు సీజన్ మంచి ఊపు మీదుంది.ఎంతో మంది తమ వివాహ బంధానికి రాం రాం చెప్తున్నారు.
తాజాగా ఈ లిస్టులో జేడీ చక్రవర్తి కూడా చేరాడనే వార్తలు వినిపిస్తున్నాయి.తన భార్య అనుక్రుతి గోవింద శర్మకు గుడ్ బై చెప్పాడని కొన్ని సైట్లు వార్తలు రాశాయి.
అయితే ఇందులో వాస్తవం ఎంత? అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు.జేడీనో లేదంటే అనుక్రుతి నోరు విప్పితే తప్ప అసలు వాస్తవం బయటకు వచ్చే అవకాశం లేదు.
"""/" /
వాస్తవానికి జేడీ చక్రవర్తి చాలా కాలం వరకు పెళ్లి చేసుకోలేదు.
అప్పట్లో శ్రీదేవి సిస్టర్ కూతురు, హీరోయిన్ మహేశ్వరితో జేడీ ప్రేమలో పడ్డాడు అనే వార్తలు వచ్చాయి.
వీరిద్దరి ఎఫైర్ గురించి ఎన్నో గాసిప్స్ హల్ చల్ చేశాయి.ఆ తర్వాత తను పెళ్లికి దూరంగా ఉన్నాడు.
మహేశ్వరితో పెళ్లి కాలేదని.ఒంటిరి జీవితం గడిపేందుకే జేడీ మొగ్గు చూపాడనే వార్తలు కూడా వచ్చాయి.
వాస్తవాలు ఏంటి అని మాత్రం తెలియదు.చివరకు 45 ఏండ్ల వయసులో లక్నోకు చెందిన అనుక్రుతిని పెళ్లి చేసుకున్నాడు.
""img Src=" Https://telugustop!--com/wp-content/uploads/2022/02/jd-chakravarthi-orce!--jpg" /
అనుక్రుతి గురించి చాలా మందికి పెద్దగా తెలియదు.
అప్పట్లో వర్మ సావిత్రి అనే సినిమాను ప్లాన్ చేశాడు.ఆ సినిమాలో ఓ టీనేజీ అబ్బాయి తనకన్నా వయసులో పెద్ద అయిన ఓ అమ్మాయి ఆకర్షణలో పడతాడు.
ఈ అమ్మాయి క్యారెక్టర్ అనుక్రుతి చేసింది.వర్మ సినిమా కాబట్టి హీరోయిన్ కు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలు జనాల్లోకి వదిలాడు.
అనుక్రుతి అనగానే అవే ఫోటోలు కనిపిస్తాయి.ఆ సినిమా చేస్తున్నప్పుడే జేడీతో అనుక్రుతికి పరిచయం పెరిగింది.
అప్పటి దాకా పెళ్లంటే ఇష్టపడని జేడీ.ఈ అమ్మాయిని చూశాక పెళ్లికి రెడీ అయ్యాడు.
కొంత మంది సన్నిహితులను పిలిచి.వారి సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.
తాజాగా వీరి వివాహ బంధానికి బీటలు వారడం నిజంగా బాధాకరం.
ఈ ఏడాది ప్రభాస్ మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తారా.. రికార్డ్ క్రియేట్ చేస్తారా?