ఆస్తుల అటాచ్పై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
TeluguStop.com
ఆస్తుల అటాచ్పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈడీ అధికారులు విచారణ చేపట్టడం సంతోషకరంగా ఉందన్నారు.తనకు ఈడీ రూపంలోనే దేవుడున్నాడని చెప్పారు.
తమకు వాహనాలు అమ్మిన అశోక్ లేలాండ్, నాగాలాండ్ అధికారులను ఈడీ విచారించలేదని తెలిపారు.
రూ.38 కోట్ల స్కామ్ అంటున్నారన్న ఆయన వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఈడీ కేసులో ఆర్డీవో, పోలీసు అధికారులు కూడా ఇరుక్కుంటారని చెప్పారు.కేసులో ప్రధాన సూత్రధారి అశోక్ లేలాండ్ ను విచారించాలని డిమాండ్ చేశారు.
నేటి నుంచే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు.. విద్యార్థులకు కీలక సూచనలు!