జేసీ పరేషాన్ : కూటమి పార్టీలకు మరో తలనొప్పి
TeluguStop.com
ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటూ ఉంటారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి.
( JC Prabhakar Reddy ) పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, జెసి ప్రభాకర్ రెడ్డి తీరు మాత్రం మారడం లేదన్నట్లుగానే ఆయన వ్యవహార శైలి ఉంటుంది.
ప్రస్తుతం అధికార పార్టీ టిడిపిలోనే( TDP ) ఉన్నా, జెసి మాత్రం ఏదో ఒక అంశంతో ఆ పార్టీకి తలనొప్పులు తీసుకువస్తున్నారు.
జెసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఆయన కుమారుడు జెసి అస్మిత్ రెడ్డి( JC Ashmit Reddy ) తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు.
అయినా తాడిపత్రిలో( Tadipatri ) మొత్తం జెసి ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లోనే అధికారులు నాయకులు పనిచేస్తున్నారు.
అస్మిత్ రెడ్డి ప్రభావం పెద్దగా ఇక్కడ కనిపించదు.జెసి చెప్పినట్లుగానే తాడిపత్రి నియోజకవర్గ అధికారులు నడుచుకోవాల్సి ఉంటుంది.
"""/" /
ఇంతవరకు బాగానే ఉన్నా, ఇప్పుడు సొంత పార్టీ నేతలతో పాటు, కూటమిలోని పార్టీలపైన జెసి ప్రభాకర్ రెడ్డి విమర్శలు చేయడం కూటమి పార్టీలకు తలనొప్పిగా మారింది .
బహిరంగంగానే విమర్శలు చేస్తున్న జెసిని కట్టడి చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు.
ఇక ఫ్లైయాష్ తరలింపు వ్యవహారంలో జెసి ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి( MLA Adinarayana Reddy ) మధ్య తలెత్తిన వివాదం రోజురోజుకు ముదురుతూనే ఉన్నాయి .
కడప ప్లయాష్ తరలింపు వ్యవహారంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జెసి ప్రభాకర్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు .
ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు నాయుడు( CM Chandrababu Naidu ) వద్దకూ వెళ్ళింది.
ఆయన ఈ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించినా, పెద్దగా ప్రయోజనం కనిపించ లేదు.చంద్రబాబుతో సమావేశానికి జేసీ ప్రభాకర్ రెడ్డి గైర్హాజరు అయ్యారు.
"""/" /
ఆదినారాయణ రెడ్డి హాజరై అక్కడ వాస్తవ పరిస్థితులను చంద్రబాబుకు వివరించారు.
ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంలో, జెసి అస్మిత్ రెడ్డిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు .
ఈ విషయం జెసి ప్రభాకర్ రెడ్డికి తెలిసినా, ఆయన వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు కనిపించలేదు.
తాజాగా మరోసారి బిజెపి నేతల పైన విమర్శలు చేశారు.ఆ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.
తాజాగా జెసి ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన బస్సు అగ్నిప్రమాదంలో దగ్ధం అయింది.దీంతో జెసి ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.
డిసెంబర్ 31న తాను మహిళల కోసం ప్రత్యేకంగా నది ఒడ్డున నూతన సంవత్సర వేడుకలు నిర్వహించానని, ఆ అక్కసుతోనే బిజెపి నేతలు తన బస్సు తగలబెట్టారని ఆరోపించారు.
ఆ వేడుకలకు వెళ్ళొద్దని బిజెపి నేతలు బాహాటంగానే ప్రకటించారని జెసి గుర్తు చేస్తున్నారు.
తన బస్సులను తగలబెట్టించింది బిజెపి వారేనని, జగనే నయమని ఆయన తను బస్సులను నిలిపివేయించేరే తప్ప, ఇలా దగ్ధం చేయించలేదని అన్నారు.
ఈ విషయంలో జగనే నయమని జెసి చెప్పడం కూటమి పార్టీలకు ఇబ్బందికరంగా మారింది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి23, గురువారం 2025