ఆ దర్శకుడు బికినీ వేసుకోమన్నారు.. నటి జయప్రద సంచలన వ్యాఖ్యలు!

తెలుగు సినిమాలలో నటించడం ద్వారా ఎన్నో సంచలన విజయాలను ఖాతాలో వేసుకున్న నటిగా జయప్రద ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.

రాజమండ్రిలో జన్మించిన జయప్రద ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండటంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

2024 ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేయాలని జయప్రద భావిస్తున్నారు.తెలుగుతో పాటు ఇతర భాషల్లో 300కు పైగా సినిమాలలో నటించి జయప్రద విజయాలను అందుకున్నారు.

ఒక సందర్భంలో జయప్రద తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

జయప్రద నటించిన ఎన్నో సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందించాయి.

సీనియర్ ఎన్టీఆర్ జయప్రద కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి.

దాసరి డైరెక్షన్ లో జయప్రద ఎక్కువ సినిమాలలో నటించారు. """/"/ అయితే ఒక సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు దాసరి నారాయణరావు బికినీ వేసుకోవాలని సూచించడంతో తాను ఇబ్బంది పడ్డానని ఆమె చెప్పుకొచ్చారు.

దేవుడు దిగి వస్తే మూవీ షూటింగ్ సమయంలో తనకు ఈ అనుభవం ఎదురైందని ఆమె కామెంట్లు చేశారు.

దాసరి గారు డ్రెస్ మార్చుకోవాలని సూచించారని అక్కడ బికినీ ఉండటంతో తాను ఆ డ్రెస్ ను ధరించలేనని చెప్పానని ఆమె చెప్పుకొచ్చారు.

దాసరి నారాయణరావు గారు మాత్రం నన్ను అసభ్యంగా చూపించనని చెప్పి ఆ డ్రెస్ వేసుకునేలా ఒప్పించారని జయప్రద కామెంట్లు చేశారు.

హీరోయిన్లు బికినీ ధరించడంలో తప్పు లేదని అయితే ఆ డ్రెస్ నాకు కంఫర్ట్ గా అనిపించలేదని ఆమె వెల్లడించారు.

ప్రస్తుతం జయప్రద బీజేపీలో ఉండగా ఆ పార్టీ నుంచి ఆమె పోటీ చేయనున్నారని సమాచారం.

ఏపీలో బీజేపీకి అనుకూలంగా పరిస్థితులు లేవనే సంగతి తెలిసిందే.