మనం ప్రతిరోజూ చూసే తెలుగు సినిమాల్లో ఎంతో మంది ఛైల్డ్ ఆర్టిస్టులు మనకు కనిపిస్తూ ఉంటారు.
అయితే వారిలో కొందరు మాత్రం మనకు జీవితాంతం గుర్తుండిపోతారు.చిన్న వయస్సులో వాళ్లు నటనలో చూపిన ప్రతిభ వల్ల వాళ్లను సులభంగా మనం గుర్తుపట్టగలుగుతాం.
అలా జయం సినిమాలో సదా చెల్లి పాత్రలో నటించిన చిన్నారికి ఆ సినిమాలోని పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా తొలి సినిమాతోనే మెప్పించిన ఆమె పేరు యామిని శ్వేత.
తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం చిత్రం అప్పట్లో సంచలనం సృష్టిస్తే ఈ సినిమా ద్వారా నితిన్, సదాలకు ఏ స్థాయిలో గుర్తింపు వచ్చిందో యామిని శ్వేతకు కూడా అదే స్థాయిలో గుర్తింపు వచ్చింది.
అక్షరాలను రివర్స్ రాస్తూ టీచర్లే రివర్స్ లో చెబుతున్నారని నవ్వులపువ్వులు పూయించడంతో పాటు సుద్దముక్కతో రైలు పెట్టెపై రాసి అక్క ప్రేమ విజయం సాధించడనికి సహాయపడే పాత్రలో యామిని శ్వేత నటించింది.
ఈ సినిమా విడుదలై చాలా సంవత్సరాలే అయినా టీవీలో ప్రసారమైతే ఈ సినిమాను చూసే అభిమానులు ఎంతోమంది ఉన్నారు.
నచ్చావులే, టెన్త్ క్లాస్ సినిమాలలో అవకాశం వచ్చినప్పటికీ వేర్వేరు కారణాల వల్ల శ్వేత ఈ సినిమాల్లో నటించేందుకు అంగీకరించలేదు.
ప్రేమలేఖ రాశా అనే చిన్న సినిమాలో నటించిన శ్వేత ప్రస్తుతం ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
కొన్ని నెలల క్రితం ఈమెకు వివాహమైంది.సినిమాలపై పెద్దగా తనకు ఆసక్తి లేదని కెరీర్ కే తన ప్రాధాన్యత అని చెప్పిన శ్వేత ఆ విధంగానే ముందుకెళుతోంది.
అయితే శ్వేత సినిమాల్లోనే నటిస్తే బాగుంటుందని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.
విదేశాల్లో మాస్టర్స్ చేసిన శ్వేత తనకు నచ్చిన రంగంలో విజయం సాధించి ఆనందంగా జీవిస్తున్నారు.